Home » బిగ్ బాస్ అంతా మోసం.. నాకు డబ్బులు ఇవ్వలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అభినయశ్రీ..!!

బిగ్ బాస్ అంతా మోసం.. నాకు డబ్బులు ఇవ్వలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అభినయశ్రీ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే రెండు వారాలను పూర్తి చేసుకొని మూడోవారంలో కి అడుగు పెట్టింది.. ఈ తరుణంలో తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన అభినయశ్రీ రెండో వారం ఎలిమినేట్ అయింది.. బయటకు వచ్చిన ఆమె బిగ్ బాస్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. నాకు బిగ్ బాస్ లో ఐదు లక్షల రూపాయల పారితోషికం దక్కింది అనే వార్తల్లో నిజం లేదని అన్నారు..

Advertisement

also read:ఆ మూవీ తీయాలని హీరో కృష్ణ తల్లి చివరి కోరిక.. కానీ మూవీ100 రోజుల ఫంక్షన్ కి ముందే అలా కావడం దారుణం..!!

Advertisement

బిగ్ బాస్ యాజమాన్యం నన్ను స్క్రీన్ లో ఎక్కువ చూపించలేదని కామెంట్ చేశారు. బిగ్ బాస్ యాజమాన్యం కొంతమందిని మాత్రమే ఎక్కువగా చూపిస్తూ, వెనుక ఉన్న వారిని అస్సలు చూపించడం లేదని తేల్చి చెప్పేసారు. నాకు బిగ్ బాస్ షో వల్ల మంచి కంటే ఎక్కువ చెడు జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేసింది అభినయ శ్రీ. బిగ్ బాస్ హౌస్ లోపల ఏం జరుగుతుందో చెప్పడం సులువు కాదని, ఆ హౌస్ మొత్తం మోసమని,నన్ను బిగ్ బాస్ చాలా మోసం చేశారని అభినయశ్రీ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ బిగ్ బాస్ విషయంలో ఎన్ని విమర్శలు వస్తున్నా కానీ షో నిర్వాహకులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.. ఇప్పటికే రెండు వారాలు గడిచినా షో రేటింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. ఇక ముందు ముందు రోజులైనా ఈ షో పుంజుకుంటుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

also read:కృష్ణం రాజు గురించి సంచలన విషయాలను చెప్పిన నటి ‘వాణి శ్రీ ‘

Visitors Are Also Reading