Home » కృష్ణం రాజు గురించి సంచలన విషయాలను చెప్పిన నటి ‘వాణి శ్రీ ‘

కృష్ణం రాజు గురించి సంచలన విషయాలను చెప్పిన నటి ‘వాణి శ్రీ ‘

by Sravanthi Pandrala Pandrala
Ad

హీరో కృష్ణంరాజు పూర్వ కాలం నుంచే అష్టైశ్వర్యాలు ఉన్న రాజుల కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇండస్ట్రీలోకి 1966 లో చిలకా గోరింక సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత ఎన్నో సూపర్హిట్ సినిమాల్లో నటించి రెబల్ స్టార్ గా మారిపోయారు. అలాంటి గొప్ప నటుణ్ని ఇండస్ట్రీ కోల్పోవడం బాధాకరం.. ఆయన మరణం తర్వాత కృష్ణంరాజు గురించి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ఈ ఒక్క విషయం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఇండస్ట్రీలో ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. అలాంటి కృష్ణంరాజుతో ఎన్నో సినిమాల్లో నటించిన నటీమణి కళాభినేత్రి వాణిశ్రీ. అలాంటి వాణిశ్రీ కృష్ణంరాజు గురించి ఏమన్నారంటే..

Advertisement

also read:ఆ మూవీ తీయాలని హీరో కృష్ణ తల్లి చివరి కోరిక.. కానీ మూవీ100 రోజుల ఫంక్షన్ కి ముందే అలా కావడం దారుణం..!!

తనతో కృష్ణంరాజుకు ఎంతో అనుబంధం ఉండేదని, ఇద్దరం కలిసి అక్క తమ్ముడుగా నటించినప్పుడు ఇదే ఏంటండీ నా తమ్ముడు నాకంటే పొడుగ్గా ఉన్నాడని, ఇలాంటి తమ్ముడు దొరకడం నా అదృష్టం అని అన్నదట.. అలా జీవనతరంగాలు సినిమాలో అక్క తమ్ముడుగా నటించిన వీరు ఆ తర్వాత అనేక సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో గోపికృష్ణ బ్యానర్ స్థాపించిన కృష్ణంరాజు.. ఆ బ్యానర్ లో తీసిన మొట్టమొదటి సినిమా “కృష్ణవేణి”. ఇందులో హీరోయిన్ నేనేనని కృష్ణంరాజు నిక్కచ్చిగా చెప్పారు. వద్దండి కృష్ణంరాజు గారు నన్నెందుకు పెట్టుకుంటున్నారు ఇంకెవరైనా వెతుక్కోండి అని చెప్పిందట. కానీ అయినా వినకుండా కృష్ణంరాజు నువ్వే హీరోయిన్ అని చెప్పారట. దీంతో ఆ సినిమా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.

Advertisement

తన బ్యానర్ లో వచ్చిన మొదటి సినిమా సూపర్ హిట్ నిలవడానికి ప్రధాన కారణం మీరే అంటూ కృష్ణంరాజుకు వాణిశ్రీ పై ఎనలేని గౌరవం పెరిగిందట. ఆ తర్వాత వాణిశ్రీ కృష్ణంరాజు కాంబినేషన్ లో భక్త కన్నప్ప, జీవనతీరాలు, సతీ సావిత్రి, మనుషుల్లో దేవుడు ఇంకా ఎన్నో సినిమాలు చేసి సూపర్ కాంబినేషన్ గా నిలిచారు. అయితే వాణిశ్రీ తన కెరియర్ సక్సెస్ ఫుల్ గా ఉన్న రోజుల్లోనే ఒక సంఘటన వల్ల ఇండస్ట్రీ నుంచి బైకాట్ చేయాలని, ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కృష్ణంరాజు వాళ్ల దగ్గరికి వెళ్లి ఒక్కొక్కరినీ కూర్చోబెట్టుకుని సర్దిచెప్పి, మనందరం సినిమా ఇండస్ట్రీ వాళ్ళం, అందరమూ ఒకటే అందరం కలిసి సహోదర భావంతో ఉండాలి తప్ప ఇలా విరోధాలు పెంచుకోకూడదు అని సర్దిచెప్పి మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చేటట్టు చేశారని వాణిశ్రీ ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేస్తూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.

also read:హిట్లర్ సినిమా ముందు ఆ హీరోకి వెళ్లిందట.. కానీ ఆ కారణం వల్లే చిరంజీవికి వచ్చిందా..?

Visitors Are Also Reading