యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమించుకోవడం సర్వసాధారణం. కానీ ప్రేమించిన వారిని చంపడమో.. లేక ప్రేమ కోసం Ha త్యలు చేయడం.. కొంత ఆత్మ Haత్యలు చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా కత్తితో 10 సార్లు, 20 సార్లు పొడచడం లేదా నరకడం వంటివి చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేయడం ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది.
Also Read : ఆ నటుడి చెంప చెల్లుమనిపించిన హీరోయిన్ ఎవరో తెలుసా ?
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన లీలా పవిత్ర.. శ్రీకాకుళంకు చెందిన దినకర్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమను అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులు అంగీకరించలేదు. వేర్వేరు కులాల అంటూ కులపిచ్చితో ఉన్న ఆ తల్లిదండ్రులు వీరి పెళ్లిని వ్యతిరేకించారు. దీంతో ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసుకోలేనని పవిత్ర దినకర్ కి చెప్పింది. దాదాపు రెండు నెలలుగా ఆమె దినకర్ ని దూరం పెడుతూ వచ్చింది. అప్పటికే దినకర్ ని వదులుకున్నాననే బాధతో ఉన్న పవిత్రకి మరొకరితో పెళ్లి నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న దినకర్ ఆగ్రహంతో పవిత్రను నిలదీసేందుకు వెళ్లాడు.
Advertisement
Also Read : హీరోయిన్ కాలు తొక్కిందని కోపంతో ఊగిపోయిన బాలయ్య..వెంటనే ఏం చేశాడంటే..?
తొలుత వీరిద్దరి మధ్య నెమ్మదిగానే వాగ్వాదం ప్రారంభమైంది. ఆ తరువాత తనను పెళ్లి చేసుకోవాలని దినకర్ ఆమెను పట్టుబట్టాడు. అంతా తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ ఆమె సమాధానం చెప్పింది. ఆగ్రహానికి గురైనటువంటి దినకర్ తనతో తెచ్చుకున్న కత్తితో పవిత్రను విచక్షణ రహితంగా పొడిచి వేసాడు. పవిత్రను అంతమొందించాలనే దినకర్ సిద్ధమై వచ్చాడని స్పష్టంగా అర్థం అవుతోంది. పవత్ర మరణించిన తరువాత కూడా దినకర్ ఆమె శవం పక్కనే కూర్చున్నాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని దినకర్ ని అరెస్టు చేశారు. లీలా ఒంటిపై దాదాపు 16 చోట్ల గాయాలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు జీవన్ భీమానగర్ పోలీసులు వెల్లడించారు.