Home » హీరోయిన్ కాలు తొక్కిందని కోపంతో ఊగిపోయిన బాలయ్య..వెంటనే ఏం చేశాడంటే..?

హీరోయిన్ కాలు తొక్కిందని కోపంతో ఊగిపోయిన బాలయ్య..వెంటనే ఏం చేశాడంటే..?

by AJAY
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణకు కోపం ఎక్కువ అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అంతేకాకుండా బాలయ్య రెండు మూడుసార్లు అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా బాలయ్య ఓ ఈవెంట్ లో తన చేతిలో ఉన్న ఫోన్ ను పక్కకు విసిరేస్తారు. అలా కొన్ని బాలయ్య వీడియో లు వైరల్ అయ్యాయి.

Advertisement

దాంతో బాలయ్యకు కోపం ఎక్కువ అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ లయ బాలయ్యతో తనకు జరిగిన ఓ అనుభవం గురించి ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాలకృష్ణతో కలిసి విజయేంద్ర వర్మ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణతో కలిసి ఓ పాటలో నటించానని చెప్పారు.

Advertisement

ఈ క్రమంలో పాటకు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బాలకృష్ణ కాలును పొరపాటున తొక్కానని చెప్పారు. కాలు తొక్కిన వెంటనే వెనక్కి తిరిగి చూసి సారీ సార్ చూసుకోలేదు అని క్షమాపణ చెప్పానని అన్నారు. కానీ బాలకృష్ణకు కోపం ఎక్కువ అని విన్నానని అన్నారు. ఆ టెన్షన్ వల్ల మరింత భయపడ్డానని చెప్పారు. కాలు తొక్కిన వెంటనే బాలకృష్ణ ప్యాకప్ చెప్పారని అన్నారు. దాంతో మరింత భయపడ్డానని తనవల్ల షూటింగ్ ఆగిపోయిందని అనుకున్నానని తెలిపారు.

ఆ తర్వాత ఒక దగ్గర కూర్చుని బాధపడుతుంటే బాలకృష్ణ తన వద్దకు వచ్చారని అన్నారు. ఏమి భయపడకు…. సరదాగా అన్నాను అంటూ మాట్లాడారని చెప్పారు. అయినా తనలో భయం తగ్గలేదని దాంతో తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం కోసం బాలకృష్ణ సరదాగా మాట్లాడుతూ జోకులు వేశారని తెలిపారు. అందరిలానే బాలకృష్ణకు కోపం ఎక్కువ అని విన్నానని కానీ ఆయనది కోపం కాదు అని ఆలస్యంగా తెలుసుకున్నానని చెప్పారు. బాలకృష్ణది మంచి వ్యక్తిత్వం అని ఆయన చాలా మంచి వ్యక్తి అని అన్నారు.

Also read : కేటీఆర్ ముందరే.. సుడిగాలి సుధీర్ పరువు తీసేసిన ఆటో రాంప్రసాద్..!

Also read : చిరంజీవిని ఫాలో అవుతున్న బాలయ్య….ఏ విషయం లో అంటే…?

Visitors Are Also Reading