Home » Vijay Thapathy:విజయ్ రెమ్యూనరేషన్ తో సౌత్ ఇండస్ట్రీలోనే రికార్డు బ్రేక్..!!

Vijay Thapathy:విజయ్ రెమ్యూనరేషన్ తో సౌత్ ఇండస్ట్రీలోనే రికార్డు బ్రేక్..!!

by Sravanthi
Ad

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు పొందిన విజయ్ దళపతి అంటే తెలియని వారు ఉండరు. ఆయన కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. కోలీవుడ్లో అగ్ర కథానాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన రేంజ్ సంపాదించుకున్న ఆయన నుండి ఒక్క సినిమా వస్తుంది అంటే ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఆయన ఇప్పటివరకు నటించిన ప్రతి సినిమా రికార్డులు బ్రేక్ చేస్తూ వచ్చింది. ఇటీవల కాలంలో వారసుడు అనే మూవీతో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విజయ్ లియో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

లోకేష్ కనకరాజు డైరెక్షన్లో ఈ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఇందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తోంది. దాదాపుగా 16 సంవత్సరాల తర్వాత వీరి జోడి మళ్లీ కనబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మూవీ పై హైప్ క్రియేట్ చేసింది. ఓవైపు లియో సినిమా చిత్రీకరణలో పాల్గొంటూనే తన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు విజయ్. ఈ సందర్భంలో ఆయన కొత్త సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది..

Advertisement

అక్కినేని నాగచైతన్య కృతి శెట్టి జంటగా నటించిన కస్టడీ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ తో కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. లేటెస్ట్ గా వస్తున్న వార్తల ప్రకారం ఆయన మరో ప్రాజెక్టు విజయ్ దళపతితో ఉండబోతుందట. ఈ సినిమా కోసం విజయ్ దాదాపుగా 150 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలోనే ఇంత పెద్ద మొత్తంలో పారితోషకం అందుకుంటున్న హీరోగా విజయ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

Visitors Are Also Reading