Home » అప్గాన్ పై రెండో టీ-20లో టీమిండియా ఘన విజయం.. యువ ఆటగాళ్లే కీలక పాత్ర..!

అప్గాన్ పై రెండో టీ-20లో టీమిండియా ఘన విజయం.. యువ ఆటగాళ్లే కీలక పాత్ర..!

by Anji
Ad

అప్గనిస్తాన్ లో రెండో టీ-20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని 6 వికెట్ల తేడాతో ఓడించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు సిరీస్ ను 2-0 తో గెలుచుకుంది. టీ-20 ప్రపంచకప్ 2024కు ముందు ఆడుతున్న చివరి ద్వైపాక్షిక సిరీస్ అప్గాన్ పై ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ.. సత్తా చాటుకుంది. ప్రధానంగా యువ ఆటగాళ్లే విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం. 

Advertisement

Advertisement

టీమిండియాతో మొదటిసారి టీ-20 సిరీస్ ఆడేందుకు అప్గానిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన విషయం విధితమే. అయితే స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గైర్హాజరీలో యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. మొహలీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో 6 వికెట్ల తేడా భారత్ విజయం సాధించింది. ఈరోజు జరిగిన మ్యాచ్ లో కూడా 6 వికెట్ల తేడాతోనే గెలిచింది భారత్. ఇండోర్ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జద్రాన్ బృందం 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లు అర్షదీప్ సింగ్ 3, రవి బిష్ణోయ్ 2, అక్షర్ పటేల్ 2, శివదూబె 1 వికెట్ చొప్పున తీశారు. ఇద్దరూ రన్ ఔట్ అయ్యారు. గుల్బదిన్ నైజ్ 35 బంతుల్లో 57, కరీం జనత్ 10 బంతుల్లో 20, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 9 బంతుల్లో 21 మెరుపు ఇన్నింగ్స్ స్కోర్ చేశారు. 

ఇక ఇండియా ఇన్నింగ్స్ లో 5వ బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగి 68 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. దూబే 32 బంతుల్లో 63 పరుగులు సాధించడంతో టీమిండియా విజయం సాధించింది. 15.4 ఓవర్లలోనే టీమిండియా ఆప్గాన్ టార్గెట్ ను ఛేదించింది. దీంతో 2-0 తో సిరీస్ సొంతం చేసుకుంది.

 

Visitors Are Also Reading