Home » జీతం రూ.30వేలు.. ఆస్తులు రూ.7కోట్లు.. అవినీతిలో అధికారిని రికార్డు..!

జీతం రూ.30వేలు.. ఆస్తులు రూ.7కోట్లు.. అవినీతిలో అధికారిని రికార్డు..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా ప్రస్తుతం ఒక ఉద్యోగం లభిస్తే చాలు అనుకునే ఈ రోజుల్లో కొంత మంది ఉద్యోగాన్ని పొంది విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తున్నారు. అక్రమంగా డబ్బు సంపాదిస్తూ హల్ చల్ సృష్టిస్తున్నారు. కొంత మంది తినడానికి తిండి లేక, ఉద్యోగం నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తాజాగా ఓ సంఘటనను మనం పరిశీలించినట్టయితే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ఒక మహిళ వయస్సు 36 సంవత్సరాలు. ఆమె ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తుంది. నెలకు దాదాపు రూ.30వేలకు పైగా వేతనం వస్తుంది. అయితే ఆమె ఆస్తులు మాత్రం దాదాపు ఏడు కోట్ల రూపాయలకు పైగానే ఉండటం విశేషం. వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. ఆమె చేసిన అవినీతిని చూసి అధికారులే ఆశ్చర్యపోయారంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.ఓ ప్రభుత్వ అధికారిని అవినీతి, బాగోతాన్ని, అవినీతి నిరోధక శాఖ అధికారులు బయటపెట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ఓసి కార్పొరేషన్ లో నిరుద్యోగిగా చేరింది ఆ మహిళ. దాదాపు  దశాబ్ద కాలంలో కోట్లాది రూపాయలు సంపాదించింది.  భూపాల్ కు చెందిన హేమా మీనా 2011లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన  మధ్యప్రదేశ్ పోలీస్ ఓసీ కార్పొరేషన్ విభాగంలో చేరారు. ప్రస్తుతం ఆమె ఇన్ చార్జీ అసిస్టెంట్ ఇంజనీరింగ్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. నెలకు 30 వేల రూపాయల జీతం తీసుకునే మీనా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిందని లోకాయుక్త అధికారులకు 2020లో ఫిర్యాదు అందింది. 

Advertisement

దీంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ విభాగానికి చెందిన బృందం సాధారణ దుస్తుల్లో మీనా ఇంటికి వెళ్లింది. వాచ్ మెన్ వారిని అడ్డుకోగా సోలార్ ప్యానల్స్ రిపేర్ చేసేందుకు వచ్చామని చెప్పి లోపలికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్ళగానే మీనాను తమ కస్టడీలోకి తీసుకొని తనిఖీలు చేపట్టగా.. కళ్ళు చెదిరే సంపద బయటపడింది. ఒక్కరోజు చేసిన తనిఖీలోనే అధికారులు ఏడు కోట్లు రూపాయలు విలువైన ఆస్తుల వివరాలను బయటికి తీశారు.మీనాకు వచ్చే అన్ని రకాల ఆదాయం కంటే ఇది 232 శాతం అధికం కావడం గమనార్హం. ఆమె తొలుత రూ. 20వేల చదరపు అడుగుల వ్యవసాయ భూమిని తన తండ్రి పేరు మీద కొనుగోలు చేసినట్లు ఈ తనిఖీలో తేలింది. ఆ తరువాత ఆ స్థలంలో కోటి రూపాయల తో విలాసవంతమైన విల్లా నిర్మించినట్లు అధికారులు వెల్లడించారు. 

పోలీస్ ఓసీ కార్పొరేషన్ చేపట్టే ప్రాజెక్టుల కోసం తీసుకున్న నిర్మాణ సామాగ్రిని కూడా మీనా తన ఇంటి నిర్మాణం కోసం వినియోగించేదని వెల్లడించారు. మీనా ఇంట్లో 20 వాహనాలు ఉండగా అందులో ఐదు నుంచి ఏడు లగ్జరీ కార్లు ఉండడం చూసి అధికారులు  ఆశ్చర్యపోయారు. రూ.30 లక్షలు విలువ చేసే 98 అంగుళాల అత్యాధునిక టీవీ సెట్, పూర్తి  వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, మొబైల్ జామర్స్ వంటి వస్తువులు ఆమె ఇంట్లో ఉన్నట్టు  అధికారులు వెల్లడించారు. 100 పెంపుడు శునకాలు, 20కి పైగా మేలు జాతి పశువులు, భారీ వ్యవసాయ యంత్రాలు హార్వెస్టర్లు వంటి వాటిని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శునకాల కోసం రోటీలు తయారు చేసేందుకు  ఓ రోటి మిషనే ఉందని తెలిపారు.  భోపాల్ లోని బీక్రియాలో మీనాకు ఇంటితో పాటు రైస్  మిల్లులు అండ్  పలు జిల్లాల్లోనూ ఆమెకు వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

 మరి కొన్ని ముఖ్యమైన వార్తలు : 

వేసవికాలంలో ఈత పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా ?

Virupaksha : విరూపాక్ష ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పటినుంచి అంటే…!

చీర్ గర్ల్స్ ను టార్చర్ పెడుతున్న బీసీసీఐ…!

Visitors Are Also Reading