తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో రోజుకో చిత్ర విచిత్ర సంఘటన వెలుగులోకి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారం పై సిట్ దూకుడుగా విచారణ చేస్తోంది. లీకేజ్ కేసులో అరెస్టుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కేసులో భాగంగా ఇప్పటికే 17 మంది అరెస్ట్ కాగా.. తాజాగా మరో ఇద్దరినీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లౌలిక్, సుష్మిత అనే ఇద్దరినీ సిట్ అధికారులు అరెస్ట్ చేసారు.
Also Read : గొడవ కి ఫుల్ స్టాప్ పెట్టిన విరాట్-షారూఖ్.. ఫ్యాన్ ఖుషీ..!
Advertisement
లౌకిక్ అనే వ్యక్తి తన ప్రేయసి సుష్మిత కోసం ప్రశ్నా పత్రాన్ని కొనుగోలు చేశారట. ప్రవీణ్ నుంచి లౌకిక్ డీఏవో ఎగ్జామ్ పేపర్ ను కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. కస్టడిలో ఉన్న నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ప్రియురాలు కోసం డీఏఓ పేపర్ ని రూ.6లక్షలకు కొనుగోలు చేసినట్టు గుర్తించారు అధికారులు. ప్రవీణ్ బ్యాంకు స్టేట్ మెంట్ పరిశీలించడంతో వీరి బాగోతం బయటపడింది. అనుమానస్పద లావాదేవీలను గుర్తించిన సిట్.. దర్యాప్తులో లౌకిక్-సుష్మిత వ్యవహారం బయటపడింది.
Advertisement
Also Read : పెళ్లికి ముందు తండ్రి కొడుక్కి నేర్పించాల్సిన 4 విషయాలు..2వది ఇంపార్టెంట్!
డీఏఓ పరీక్షను ఫిబ్రవరి 26వ తేదీన పేపర్ లీకేజ్ జరిగిన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ పరీక్షను రద్దు చేస్తూ.. నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విచారణ పూర్తి అయ్యేలోపు ఇంకా ఎంత మంది పేర్లు బయటికి వస్తాయో వేచి చూడాలి. ఇదిలా ఉండగా.. పేపర్ లీక్ కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక పోలీసులకు చేరిన విషయం విధితమే. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక నుంచి సీజ్ చేసిన సెల్ ఫోన్లను ఎఫ్ఎస్ఎల్ కి అధికారులు పంపించారు. ప్రవీణ్, రాజశేఖర్ లాప్టాప్, సిస్టమ్స్ ని అధికారులు పంపించారు. ఏప్రిల్ 11న కోర్టులో కేసు నివేదికను సిట్ సమర్పించనుంది. NRI ప్రశాంత్ కి మరోసారి సిట్ నోటీసులు జారీ చేయనుంది.
Also Read : జగన్ కు బాలయ్య మాస్ వార్నింగ్… సైకో ప్రభుత్వానికి చమరగీతం పాడాలని పిలుపు…