Home » గొడవ కి ఫుల్ స్టాప్ పెట్టిన విరాట్-షారూఖ్.. ఫ్యాన్ ఖుషీ..!

గొడవ కి ఫుల్ స్టాప్ పెట్టిన విరాట్-షారూఖ్.. ఫ్యాన్ ఖుషీ..!

by Anji

ఒకరు ఏమో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తే.. మరొకరేమో క్రికెట్ లో ప్రపంచ రికార్డులను బద్ధలు కొడుతుంటారు. వీరిదారులు వేర్వేరు అయినా  గమ్యం మాత్రం అభిమానులను సంపాదించుకోవడమే.దేశంలో వారి రంగాల్లో ఇద్దరూ విపరీతమైన ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్నారు. వీరు ఎన్నో సాధించి.. ఎంతో సంపాదించారు. కొద్ది సంవత్సరాలు అయినా చెక్కు చెదరని క్రేజ్ వీరి సొంతం.   వీరిలో ఒకరు బాలీవుడ్ బాద్ షా, దేశంలో అగ్ర నటులలో ఒకరు అయినా షారూఖ్ అయితే మరొకరు ఇండియన్ క్రికెట్ సెన్షేషన్ కింగ్ విరాట్ కోహ్లీ. వీరిలో ఒకరినీ చూస్తే అభిమానుల కోలాహలం నెక్ట్స్ లెవల్ లో ఉండటం గ్యారంటీ. ఇద్దరూ ఒక చోట కలిసిన వేళ.. అభిమానులకే కాదు.. మొత్తం దేశానికే ముచ్చట గొలిపేలా ఉంటుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఇద్దరి స్టార్లను ఒక చోటుకు చేర్చింది.

Also Read :  ఐశ్వర్యారాయ్-అభిషేక్ బచ్చన్ విడాకులు?

ఐపీఎల్ లో భాగంగా కోల్ కతా, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం విధితమే. మ్యాచ్ సంగతి అటు ఉంచితే.. ఈ మ్యాచ్ కి ముందు షారూఖ్, విరాట్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చారు. టాస్ కి ముందు గ్రౌండ్ లో కోహ్లీ, షారూఖ్ ఒకటై కాస్త సరదాగా చిందులేశారు. పఠాన్ సినిమాలోని పాటకు షారూఖ్ కోహ్లీకి డ్యాన్స్ నేర్పిస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది. అంతేకాదు.. కోహ్లీ దగ్గరికీ వచ్చి గట్టిగా హత్తుకుపోవడం అందరినీ ఆకట్టుకుంటుంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు అసలైన కింగ్ ఎవరనే విషయంలో కోహ్లీ, షారూఖ్ ఖాన్ అభిమానుల మధ్య ఎంత పెద్ద వార్ జరిగిందో అందరికీ తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఇలా కలిసి సరదాగా చిందేయడం, వారి ఫ్యాన్స్ మధ్య గొడవలు పటా పంచల్ అయ్యాయి.

Also Read :  జగన్ కు బాలయ్య మాస్ వార్నింగ్… సైకో ప్రభుత్వానికి చమరగీతం పాడాలని పిలుపు…

Manam News

ఈ మ్యాచ్ లో కేకేఆర్ 81 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీపై భారీ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఆరంభంలో తడబడినా ఆ తరువాత శార్దూల్ (68) రింకు సింగ్ (46) మెరుపులతో 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్ ఆర్డర్ లో గుర్బాజ్ అర్దసెంచరీతో రాణించాడు. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ శుభారాంభం ఇచ్చినా కేకేఆర్ స్పిన్నర్ల దాటికి పెవిలియన్ కి క్యూ కట్టారు. దీంతో ఆర్సీబీ జట్టు కేవలం 123 పరుగులు మాత్రమే చేసి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. మొత్తానికి మ్యాచ్ సంగతి పక్కన పెడితే షారూఖ్ ఖాన్, కోహ్లీ కలిసి చిందేయడం నిన్న మ్యాచ్ కి హైలెట్ గా నిలిచింది.

Also Read :  ప్రభాస్ వల్ల రాజమౌళికి తిట్లు.. ఛత్రపతి ఇంటర్వెల్ సీన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా ?

Visitors Are Also Reading