Home » జుట్టు పల్చగా అయిపోయిందా..? అరటిపండుతో అందమైన కురులని పొందవచ్చు..!

జుట్టు పల్చగా అయిపోయిందా..? అరటిపండుతో అందమైన కురులని పొందవచ్చు..!

by Sravya
Ad

అందమైన కురులని పొందాలంటే ఇలా చేయండి. చాలామంది ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడం, జుట్టు పల్చగా అయిపోవడంతో బాధపడుతున్నారు. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతుంటే… ఇలా చేయండి. ఈ హోమ్ రెమిడీ చాలా చక్కగా పనిచేస్తుంది. కురుల ఆరోగ్యానికి అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. మిక్సీ జార్ తీసుకుని ఒక అరటిపండు ముక్కలని కట్ చేసి వేసుకోండి.

Advertisement

Advertisement

రెండు మందారం పువ్వులు, రెండు టేబుల్ స్పూన్లు కలబంద గుజ్జు అలానే రెండు స్పూన్ల ఆముదం, మూడు స్పూన్లు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోండి. అలానే ఇందులో ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి కూడా వేసుకోండి. దీనంతటిని బాగా మెత్తగా చేసుకుని జుట్టు కుదుళ్ళకి బాగా పట్టించండి. ఆ తర్వాత గంటసేపు అలా వదిలేసి తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. వారానికి రెండు సార్లు ఈ చిట్కాని పాటించవచ్చు జుట్టు రాలడం తగ్గుతుంది అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు.

Also read:

Visitors Are Also Reading