మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై చిరంజీవి స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆగస్టు 31న రక్షాబంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సెలబ్రిటీస్ సైతం తమ సోదరులకు రాఖీ కట్టారు. సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవి చెల్లెలు ఆయన ఇంట్లో మెగా బ్రదర్స్ కి రాఖీ కట్టి అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. సంబంధించిన వీడియోను చిరంజీవి తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. ప్రతీ ఒక్కరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.చిరు షేర్ చేసిన ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. తన ఇంట్లోని పూజ గదిలో తనకు జన్మనిచ్చిన తండ్రి వెంకట్ రావు, మామయ్య అల్లు రామలింగయ్య ఫొటోలను పెట్టి దేవుళ్లతో సమానంగా పూజిస్తున్నారు చిరంజీవి. ఇది గమనించిన అభిమానులు సినీ పరిశ్రమలో ఎంతో మందికి స్ఫూర్తి అయిన చిరంజీవి ఎప్పటికీ మూలాలను మరిచిపోరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇవే కాకుండా చిరంజీవి షేర్ చేసిన వీడియోలో మరొకటి నెటిజన్స్ ,దృష్టిని ఆకర్షించింది. అది ఏంటంటే..?
చిరు చేతికి ఉన్న వాచ్.. సంప్రదాయ దుస్తులలో ఉన్న చిరు ఎడమ చేతికి రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రపీ డేటోనా వైట్ టైగర్ వాచ్ ధరించారు. అత్యధిక విలువైన ఈ వాచ్ ధర చాలా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. ఈ వాచ్ ధర కోసం నెటిజన్లు చిరంజీవి ధరించిన వాచ్ ధర రూ.2.35 లక్షల డాలర్లు అని తెలుస్తోంది. భారత కరెన్సీ ప్రకారం.. సుమారు రూ.2కోట్లు. ఆ వాచ్ ధర తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో బేబీ మూవీ ఈవెంట్ లో కూడా చిరంజీవి ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అప్పుడు చిరు రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్ అందరినీ ఆకట్టుకుంది. దీని ధర రూ.23,000 డాలర్స్. అంటే భారత కరెన్సీ ప్రకారం.. 1.89కోట్లు. వాస్తవానికి చిరంజీవికి కొత్త కార్లు, వాచ్ కలెక్షన్లు అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఇదివరకే చెప్పుకొచ్చారు చిరంజీవి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
చిరంజీవి ఇంట్లో చిత్రీకరించిన బాలకృష్ణ సినిమా అదేనా ?
Sunil : సునీల్ చెంప చెల్లుమనిపించిన టాలీవుడ్ హీరోయిన్..?