సాధారణంగా మందు తాగిన తరువాత మనలో ధైర్యం తన్నుకొస్తూ ఉంటుందని అంటారు. ఆ ధైర్యంతో మనం చేయాలనుకుని చేయలేకపోయిన పనులను చేసేస్తూ ఉంటాం. అయితే.. తాగి ఎక్స్ కు మెసేజ్ చేయడం చాలా సాధారణంగా జరిగే విషయం. ఎందుకంటే మనం తాగినప్పుడే మనకి ఎక్కువ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి టైం లోనే మనం మన ఫీలింగ్స్ ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం.
Advertisement
అయితే.. తాగినప్పుడు ఎవరైనా బాస్ కి మెసేజ్ చేస్తారా? అస్సలు చెయ్యరు కదా. కానీ ఒక వ్యక్తి మందు ఎక్కువై తన బాస్ కి మెసేజ్ చేసాడు. ఇప్పుడు ఈ మెసేజ్ వాట్సాప్ లో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తాను పని చేస్తున్న వ్యక్తికి ఇలా మెసేజ్ చేసాడు. బాస్ నేను తాగి ఉన్నాను. కానీ, మీకొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నన్ను నమ్మినందుకు చాలా సంతోషం. ప్రతి సారి నన్ను ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నందుకు మీకు ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే.
Advertisement
ఈరోజుల్లో ఒక మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకోవడం కన్నా.. ఒక మంచి మేనేజర్ ని పొందడం చాలా కష్టం. ఆ విసహాయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఈ విషయంలో మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయవచ్చు అంటూ తన బాస్ కి మెసేజ్ చేసాడు. ఈ మెసేజ్ కూడా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో వచ్చింది, ఇది నా రోజుని సంతోషంగా మార్చింది అంటూ సదరు మేనేజర్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ చాట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మీరు అమేజింగ్ లీడర్ అంటూ నెటిజన్లు ఆ బాస్ ని అభినందిస్తున్నారు. సదరు బాస్ మాత్రం నాకు అమేజింగ్ టీమ్ ఉంది అంటూ హుందాగా రిప్లై ఇచ్చారు.
క్లీంకారకు చిరంజీవి దంపతులు స్పెషల్ గిప్ట్ అందుకోసమేనా ?
ఆ సినిమాకి రజినీకాంత్ కంటే ఎక్కువగా ఆ హీరోయిన్ పారితోషకం తీసుకుందా ?