Home » వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ మూవీ నుంచి సర్ ప్రైజ్ అప్డేట్..!

వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ మూవీ నుంచి సర్ ప్రైజ్ అప్డేట్..!

by Anji
Ad

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటిస్తున్న మూవీ గాండీవధారి అర్జున. ఈ సినిమా నుంచి మూవీ సర్ ప్రైజింగ్ అప్డేట్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది చిత్ర యూనిట్. వరుణ్ తేజ్, ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గాండీవధారి అర్జున మూవీని విలక్షణ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించాడు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర  బ్యానర్ పై గాండీవధారి అర్జున మూవీని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 

Advertisement

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేశారు. అది ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. మీడియం రేంజ్ బడ్జెట్ తో టాప్ క్లాస్ విజువల్స్ అందించారని మూవీ టీమ్ సర్వత్రా ప్రశంసలను అందుకుంది. ఈ టీజర్ తో పాటు ఇటీవల విడుదలైన సినిమాలోని ఫస్ట్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు సంగీతం మిక్కి జే మేయర్ అందిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Advertisement

గాండీవధారి అర్జున మూవీకి సంబంధించి ట్రైలర్ విడుదల తేదీని కొద్ది సేపటి కిందనే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆగస్టు 10న మధ్యాహ్నం 3గంటలకు ఈ మూవీ ట్రైలర్ ను ప్రసాద్ ఐమాక్స్ రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ గా ప్రకటించింది చిత్ర యూనిట్. ప్రస్తుతం కెరీర్ ఆశించినంత సక్సెస్ ఫుల్ గా లేని వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున మూవీతో హిట్ ట్రాక్ లో పడతాడో లేదో వేచి చూడాలి. అదేవిధంగా అక్కినేని నాగార్జునతో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన మూవీ ఘోస్ట్ ఫ్లాప్ కావడంతో గాండీవధారి అర్జున మూవీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకు చాలా కీలకంగా మారింది. ఈ మూవీ ఎలా ఉంటుంతో తెలియాలంటే మాత్రం విడుదలయ్యేంత వరకు ఎదురుచూడాల్సిందే. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 చివరి రోజుల్లో శోభన్ బాబుకి వింత వ్యాధి.. మరణించడానికి ముందు ఏం జరిగిందో తెలుసా ?

అంబటికి చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్…పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా అంటూ ఫైర్!

నాగార్జున నటించిన ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’ మూవీ రహస్యాలు ఇవే..!

Visitors Are Also Reading