Home » చివరి రోజుల్లో శోభన్ బాబుకి వింత వ్యాధి.. మరణించడానికి ముందు ఏం జరిగిందో తెలుసా ?

చివరి రోజుల్లో శోభన్ బాబుకి వింత వ్యాధి.. మరణించడానికి ముందు ఏం జరిగిందో తెలుసా ?

by Anji
Ad

సీనియర్ హీరో శోభన్  బాబు గురించి  దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి.. ఉన్నత స్థాయికి ఎదిగాడు. చదువుకునే రోజుల్లో నాటకాలపై ఆసక్తి పెంచుకొని అనతి కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. శోభన్ బాబు గారికి చివరి రోజుల్లో ఓ మానసిక వ్యాధి సోకిందని చిత్ర పరివ్రమంతా అసలు ఎందుకు అనుకుంది ?   సినీ ఇండస్ట్రీకి 1996లో గుడ్ బై చెప్పారు శోభన్ బాబు. 2001 నుంచి ఇంట్లో నుంచి బయటికీ రావడానికి మానేశారు. తెలుగు సినీ రంగంలో సోగ్గాడు శోభన్ బాబు. సినీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. ఒక అవకాశం రాగానే దానిని అందిపుచ్చుకొని నటనలోనే కాకుండా సంపాదనలో ఆయన ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. శోభన్ తన ముందు తరాల వ్యక్తుల వద్ద నటన నేర్చుకున్నాడు. 

Advertisement

శోభన్ బాబు తన సంపదను మొత్తం తోటలు, భవనాలు, స్థలాల మీద పెట్టాడు. అప్పట్లోనే మద్రాస్ లో 50 బిల్డింగ్ లు కలిగి ఉండటం అంటే.. మాటలు కాదు. సినీ రంగంలో అందరి కంటే సంపద కలిగిన వ్యక్తి శోభన్ బాబేనేమో. 1996లో రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత చాలా ఆఫర్లు వచ్చాయి. వాటన్నింటికి నో చెప్పారు శోభన్ బాబు. సినిమాలకు గుడ్ బై చెప్పిన తరువాత ఆయన మొదటి ఐదేళ్లు ఒకలా.. ఆ తరువాత ఏడేళ్లు మరోలా కొనసాగాయి. ఐదేళ్ల పాటు తన అందాన్ని సొంత ఖర్చులతో భరించుకుంటూ వచ్చాడు. 2001 లో ముసలివాడివి అయిపోతున్నావని ఓ మహిళ శోభన్ బాబుతో అనగా అప్పటి నుంచి ఇల్లు వదిలి బయటికీ రావడం మానేశాడు శోభన్ బాబు. ఆస్తులను కాపాడుకునే బాధ్యతలను కొడుకులకు అప్పగించాడు. 2008లో ఆయన చెల్లి ఝాన్సీ మరణించినప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయారు.

Advertisement

తనకు తానుగా ధైర్యం చెప్పుకోవడం మొదలు పెట్టాడు. శోభన్ బాబు తన సన్నిహితుల వద్ద వందేళ్లు బతుకుతా అని చెప్పుకునేవారు. ఆరోగ్య అలవాట్ల గురించి వివరిస్తూ.. మా తాత 107 ఏళ్లు బతికాడు. మా నాన్న 100 సంవత్సరాలు బతికాడు. నేను కూడా వందేళ్లు బతుకుతాను అని.. శోభన్ బాబు అనేవారు. అప్పటివరకు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే ఆయన మరణం సంభవించడం శోచనీయం. మార్చి 20, 2008లో తన కుమారుడితో చాలా సేపు మాట్లాడాడు. మద్రాస్ లో నిర్మించే బిల్డింగ్ గురించి తండ్రి కొడుకులు చర్చించుకున్నారు. కుర్చిలోంచి పైకి లేచిన శోభన్ బాబు వెంటనే కిందపడిపోయారు. అదే సమయంలో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భార్య బయటికి వచ్చి కుప్పకూలిపోయి రోధించింది. కొడుకుతో చివరి సారి మాట్లాడిన నిమిషాల వ్యవధిలోనే శోభన్ బాబు మరణించాడు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

అంబటికి చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్…పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా అంటూ ఫైర్!

మహేష్ బాబు, నమ్రతల పెళ్లికి కృష్ణ ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా ?

వామ్మో.. 150 అడుగుల హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన ప్రేమికులు.. వీడియో వైరల్..!

Visitors Are Also Reading