Home » నాగార్జున నటించిన ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’ మూవీ రహస్యాలు ఇవే..!

నాగార్జున నటించిన ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’ మూవీ రహస్యాలు ఇవే..!

by Anji
Ad

అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నాగేశ్వరరావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు నాగార్జున. తన  సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలను చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. అలాంటి నాగార్జున ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ  ఇచ్చినప్పుడు ఒకటి రెండు సినిమాలు హిట్  కొట్టిన తర్వాత ఆయనకు వరుసగా ప్లాప్స్ వచ్చాయి. ఇక సినీ కెరీర్  ముగిసే దసకు వచ్చింది. ఆ సమయంలోనే వచ్చిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమా నాగార్జున లైఫ్ ని  ఓ మలుపు తిప్పిందనే చెప్పవచ్చు. ఆ మూవీ గురించి ఇప్పుడు ఆసక్తికర విషయాలను మనం తెలుసుకుందాం. 

Advertisement

శివ సినిమా తర్వాత నాగార్జునకు వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. నిర్ణయం, కిల్లర్,  చైతన్య,  శాంతి క్రాంతి వంటి సినిమాలు అపజయాన్ని చవిచూశాయి.  ఇక ఆ సమయంలో ఒక హిట్  పడితేనే నాగార్జున కెరీర్ గాడిలో పడుతుందనుకున్న సమయంలోనే  వచ్చిన సినిమా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. పల్లెటూర్లలో ఎడ్ల పందాలు, ఎన్నికల్లో పోటీ చేయడం, ధనవంతులపై ఓ సామాన్య వ్యక్తి విజయం సాధించడం ఈ సినిమా కథ. నాగార్జున నటించిన ఈ సినిమా అప్పట్లో సెన్షేసన్ సృష్టించింది. 

Advertisement

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైనటువంటి కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ప్రెసిడెంట్ వారి పెళ్ళాం మూవీ తెరకెక్కింది. ఇందులో హీరోయిన్ గా మీనా నటించారు. ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకు ఎంతో కలిసి వచ్చిందని చెప్పాలి. నాగార్జున కెరీర్ లోనే తొలి మాస్ సూపర్ హిట్ మూవీ గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పట్లోనే మొదటివారం కోటి 28 లక్షల రూపాయలను వసూలు చేసింది ప్రెసిడెంట్ వారి పెళ్ళాం మూవీ. ఇలా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా నాగార్జున కెరీర్ ని ఓ మలుపు తిప్పిందని చెప్పవచ్చు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

రెండుసార్లు లవ్ ఫెయిల్యూర్ అయిన ఈ హీరోయిన్ జీవితం చివరికీ ఏమైందంటే ?

నటి సుజాత జీవితంలో పడిన ఇబ్బందుల గురించి తెలిస్తే కన్నీరు పెట్టకుండా ఉండరు..!

విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకునేది ఆమెనేనా.. మ్యారేజ్ పై క్లారిటీ..!

Visitors Are Also Reading