Home » అంబటికి చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్… మొదట ప్రత్యేక హోదా తీసుకురండి !

అంబటికి చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్… మొదట ప్రత్యేక హోదా తీసుకురండి !

by Bunty

గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం వర్సెస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఏపీ రాజకీయాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో భాగంగా వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ఉంటే… తాజాగా బ్రో సినిమా కలెక్షన్ల పేరుతో మరో వివాదానికి తెరలేపింది జగన్ సర్కార్.

పవన్ కళ్యాణ్ అడ్డగోలుగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని… ఒక సినిమాలో 70% పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ రూపంలో వసూలు చేస్తున్నాడని సంచలన ఆరోపణ చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. అంతేకాదు పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయిందంటూ వ్యాఖ్యానించారు. బ్రో సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనే విషయాన్ని ప్రకటించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

అయితే తాజాగా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు మెగాస్టార్ చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ వైసీపీ నేతల పేరు ఎత్తకుండా చురకలాంటించారు చిరంజీవి. ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వాక్యాలు చర్చనియాంశంగా మారాయి. ‘యాక్టర్ల రెమ్యునరేషన్ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఫిల్మ్ ఇండస్ట్రీ పైన పడతారేంటి. మీలాంటి వాళ్ళు ప్రత్యేక ఉపాధి, హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ అవకాశాల గురించి ఆలోచించాలి. పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు’ అని వాక్యానించారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అంబటి రాంబాబును ఉద్దేశించే ఉన్నాయని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

విజయ్ తొడలపైన సమంత…నాగచైతన్య ఫ్యాన్స్ ఆగ్రహం !

సుమంత్ కీర్తి రెడ్డికి విడాకులు ఇవ్వడం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?

Nayanatara : నయనతార మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

 

Visitors Are Also Reading