కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చినటువంటి ‘ఖడ్గం’ సినిమాలో నటించిన అందాల ముద్దుగుమ్మ కిమ్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమాలో ఈ అమ్మడు చాలా అద్భుతంగా నటించింది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఖడ్గం సినిమా తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.
Advertisement
ఆ సినిమా అనంతరం ఆంజనేయులు, మగధీర వంటి సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించింది. ఇక ఈ అమ్మడు 2010లో ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి అలీని ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ ఆ వివాహ బంధం అతి కొద్ది రోజుల్లోనే ముగిసిపోయింది. పెళ్లయిన ఐదు సంవత్సరాలకి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ అమ్మడు సపరేట్ గానే ఉంది.
Advertisement
ఇక కొన్ని రోజులకు టెన్నిస్ దిగ్గజం అయినటువంటి లియాండర్ తో ప్రేమలో పడింది. ఇక వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక సినిమాలకు పూర్తిగా దూరమైనటువంటి కిమ్ శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 40 పదుల వయసు దాటినప్పటికీ చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇవి కూడా చదవండి
సంజూకు నో ఛాన్స్.. BCCI, ఇషాన్ కిషన్ పై ఫ్యాన్స్ ఫైర్
India Squad of World Cup 2023 : సంజూ, ధావన్‌కు చోటు.. సూర్య ఔట్ ?
అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?