Home » ఓల్డ్ ఈజ్ గోల్డ్.. పాత ఐఫోన్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

ఓల్డ్ ఈజ్ గోల్డ్.. పాత ఐఫోన్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా ఐ ఫోన్ బ్రాండ్ కి యూత్ చాలా మంది కనెక్ట్ అవుతుంటారు. అత్యంత ప్రజాధరణ పొందిన బ్రాండెడ్ ఫోన్ లలో ఇది ఒకటి. చాలా మంది ముఖ్యంగా ఐ ఫోన్ కొనడానికి సంవత్సరాల తరబడి డబ్బును సేవ్ చేస్తున్నారు. అనగా ఐపోన్ క్రేజ్ ఏంటో ఊహించుకోవచ్చు. ఎప్పటికీ ఈ క్రేజ్ తగ్గదనే చెప్పాలి. కాస్ట్, బ్రాండ్, క్వాలిటీ అన్ని చాలా బాగుంటాయి. అందుకే రోజు రోజకు  ఈబ్రాండ్  ఫోన్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ఒక్క ఆపిల్ ప్రొడక్ట్ ఏదైనా డిమాండ్ బాగానే ఉంటుంది. రాబోయే లేదా లేటేస్ట్ మోడల్ పై చాలా క్రేజ్ నెలకొంది. 

Advertisement

మనం చెప్పుకోబోయేది పాత ఫోన్ గురించి.. ఐఫోన్ ఫస్ట్ ఎడిషన్ ఫోన్లకు మార్కెట్ మంచి డిమాండ్ ఉంది. ఇటీవల ఆ ఫోన్లను కొనడానికి క్యూ లైన్ కడుతున్నారు. పాత మోడల్ ఐఫోన్ ధరలు ఏ లేటెస్ట్ మోడల్ కి కూడా లేనంతగా పెరిగిపోయాయి. ఇది సాధారణ ఐఫోన్ కాదు. ఆపిల్ మొదటి తరం ఐఫోన్. విశేషం ఏంటంటే.. ఈ ఫోన్ సీల్డ్ ఫ్యాక్ లో ఉండటం విశేషం. యాపిల్ ఫస్ట్ జెన్ ఐఫోన్ వేలం రూ.1.5 కోట్ల వరకు పలికిందట. అవును అండి మీరు విన్నది వాస్తవమే. ఈ ధర చాలా ఎక్కువగా అనిపించినా వేలంలో ఈ ధర లభించింది. వేలం వేయడం ఇది మొదటికేసు కానప్పటికీ ఆపిల్ మొదటి తరం సీల్డ్ ప్యాక్ ఐఫోన్ ఇప్పటికే తాజాగా 2023లో $63,000 కి వేలం వేయబడింది. కానీ చివరికీ కోటికి పైగా సొంతం చేసుకుంది. ఇది రికార్డు అనే చెప్పాలి. 

Advertisement

4GB మోడల్ యూఎస్ వేలంలో $190చ372.80(రూ.1.5కోట్ల కంటే ఎక్కువ) ధరకే విక్రయించబడింది. LCG వేలం ద్వారా నిర్వహించబడే ఈ అసలైన ఐఫోన్ 7 లాట్ మొత్తం 28వేలం పాటలను ఆకర్షించింది. దాదాపు 400 రెట్లు దాని అసలు ధరకు విక్రయించడం ద్వారా మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. వేలం $50,000 నుంచి $100,000 మధ్య అమ్ముడు పోతుందని అంచనా వేయబడింది. ఇది అన్ని అంచనాలను అధిగమించింది. ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. యాపిల్ మొదటి ఐఫోన్ టచ్ స్క్రీన్ ఫోన్.. ఇది 3.5 అంగుళాల డిస్ ప్లే ను కలిగి ఉంది. ఇది 320*480 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంది. ప్రాసెసర్ గురించి మాట్లాడుతూ.. తొలి తరం ఐఫోన్ 412 MHz వన్-కోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇందులో 2Mp వెనుక కెమెరా ఇవ్వబడింది. కానీ అందులో సెల్ఫీ కెమెరా లేదు. సింగిల్ సిమ్ సపోర్టుతో పరిచయం చేయబడింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

టాలీవుడ్ హీరోలకు ఉన్న కార్లు..లిస్ట్ ఇదే

తెలంగాణ కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న నేతలు ! అధికారం ఖాయమనే ధీమానా ?

 ఐ-ఫోన్ నిషేదించిన రష్యా.. అందుకోసమేనా ?

Visitors Are Also Reading