సరిగ్గా పాతికేళ్లు కూడా లేని శ్యామ్ అనే యువకుడు అకస్మాత్తుగా మరణించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శ్యామ్ అనే యువకుడు జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని కావడంతో అనుమానస్పదంగా మరణించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. తూర్పుగోదావరి జిల్లా చింతలూరు గ్రామానికి చెందిన శ్యామ్ ఎన్టీఆర్ వీరాభిమాని. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ ప్రమోషన్స్ అన్ని ముగించుకొని విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ అభిమానులు ఈవెంట్ కి భారీ సంఖ్యలో వచ్చారు. అందులో శ్యామ్ కూడా ఉండటం విశేషం. ఆ సమయంలో శ్యామ్ ఎన్టీఆర్ దగ్గరికీ పరుగెత్తుకుంటూ వెళ్లి ఆయనతో ఫొటో దిగగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
తాజాగా ఎన్టీఆర్ శ్యామ్ మరణంపై స్పందించారు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన ఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం నా మనసును కలిచి వేస్తుంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఎన్టీఆర్ స్పందించడంతో శ్యామ్ డెత్ మిస్టరీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
సాధారణంగా ఒకవేళ శ్యామ్ ఉరేసుకుంటే కాళ్లు నేలమీద ఆనడం.. గొంతు వద్ద చర్మం మామూలుగానే ఉండడం.. ముక్కులోంచి రక్తం రావడం.. అదే సమయంలో చేయి కోసుకొని ఆ బ్లేడును జేబులోనే దాచాడనే కారణాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు పోలీసుల వద్ద ఎలాంటి సమాధానం లేదు. కానీ శ్యామ్ తండ్రి ఏమంటున్నాడంటే.. ఆయన ఒక సాధారణ కూలీ. తాపి మేస్త్రీగా పని చేస్తుంటాడు. ఏదో కోచింగ్ కి వెళ్తానని చెప్పి వెళ్లాడు. 15 రోజుల వరకు ఫోన్ చేయలేదు. మేము వీడియో కాల్ చేసి మాట్లాడాం. ఆ తరువాత మళ్లీ కాల్ చేస్తే ఫోన్ కలువలేదు. తెల్లారిన తరువాత ఫోన్ వచ్చింది. శ్యామ్ కి యాక్సిడెంట్ అయిందని.. తిరుపతిలో ఉన్న శ్యామ్ కుటుంబ సభ్యులు బయలుదేరారు. వాళ్లు వచ్చే సరికి అప్పటికే శ్యామ్ చనిపోయాడు అని చెప్పారు. లోపలికి వెళ్లి చూస్తే శరీరంపై గాయాలు కనిపించాయి. ముందు రోజు రాత్రి మాతో ఫోన్ లో మాట్లాడాడు.
Advertisement
ఏమి అనుమానంగా అనిపించలేదు. ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడి ఉంటాడో చూడండి.. చెప్పండి. అని అన్నాం. అన్నీ చూస్తామని డీఎస్పీ గారు చెప్పారు. కాసేపటికే ఫోన్ లో ఉన్న వీడియోలను మాకు చూపించారు. ఒక దాంట్లో మా గురించి, మరొక దాంట్లో ఉద్యోగం చేయడం ఇష్టం లేదని.. మరొక దాంట్లో వేరే వాళ్ల గురించి మాట్లాడాడు. వాటిలో నిజాలు ఎంత అనేది అనుమానంగా ఉంది. ఫోన్ కాల్ డేటా లిస్ట్ చూస్తే.. అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు మాకు ఫోన్ చేశారు. మాకు అండగా ఉంటామని చెప్పారు. అందుకు వారికి ధన్యవాదాలు అంటూ శ్యామ్ తండ్రి చెప్పుకొచ్చాడు. తూర్పుగోదావరి జిల్లా చింతలూరు గ్రామానికి చెందిన శ్యామ్.. జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని. శ్యామ్ మరణించడం పట్ల వైసీపీ నేత హస్తం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ కూడా చేశారు.
సెల్పీ వీడియోలో పక్కన ఎవ్వరో ఉన్నారని.. వారు ఎవ్వరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. జాబ్ చేయడం ఇష్టం లేదని.. అమ్మానాన్నలు క్షమించాలని సెల్పీ వీడియోలో వివరించాడు శ్యామ్. అతను మాట్లాడుతుండగా పక్కన వేరే వాళ్ల మాటలు వినిపించాయి. వారు ఎవ్వరు అనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని పేర్కొంటున్నారు టీడీపీ నేతలు. మరోవైపు శ్యామ్ ఎవరినీ ప్రేమించాడు. ఎందుకు తేడా వచ్చింది. శ్యామ్ ప్రేమించిన యువతి ఎవరు..? ఒకవేళ అతను ప్రేమించిన యువతి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందా..? ఆమె శ్యామ్ తో నిజంగానే విడిపోయిందా..? అసలు ఆమె వివరాలను ఇప్పటికీ ఎందుకు బయటపెట్టలేదు. అయితే వివరాలను బయటపెట్టకపోయిన పర్వాలేదు. . కానీ ఆమె స్టేట్ మెంట్ ని కూడాతీసుకోకపోవడం మిస్టరీగా మారింది. శ్యామ్ మరణం మిస్టరీ ఎప్పుడు తేలుతుందో వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
MS DHONI : గంటల వ్యవధిలో అపర కుబేరులను చేశాడు… ధోనీ అంటే మాములుగా ఉండదుగా !
టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు చేయని ఏకైక మొనగాడు ?