Home » టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు చేయని ఏకైక మొనగాడు ?

టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు చేయని ఏకైక మొనగాడు ?

by Bunty
Ad

మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 47 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ కుర్రాడిలా కనిపిస్తాడు ఈ హీరో. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు సొంతం చేసుకున్నాడు. అతిచిన్న వయసునుంచే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇతని నటనకి ఎంతోమంది ప్రేక్షకులు ఉన్నారు. అయితే మహేష్ బాబు తన కెరీర్ లో ఒక్కటంటే ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు. ప్రతి ఒక్క హీరో వారి జీవితంలో రీమేక్ సినిమాలు తప్పకుండా చేస్తారు. కానీ మహేష్ బాబుకి రీమేక్ సినిమాలు అంటే అంతగా నచ్చవట.

 

Advertisement

రీమేక్ సినిమాని ఇంతకుముందే ప్రేక్షకులు చూసేసి ఉంటారు. మళ్లీ అదే సినిమాని రీమేక్ చేసి చూపించడంలో పెద్దగా మజా ఉండదు. సినిమా రీమేక్ సమయంలో అంతకుముందే ఒక హీరో ఉంటాడు. మళ్లీ నేను యాక్ట్ చేసే సమయంలో ఆ హీరోలా చేయాలా… లేకపోతే నా స్టైల్ లో చేయాలా… అనేది అర్థం కాదు. అందుకే నాకు రీమేక్ సినిమాలు అంటే పెద్దగా నచ్చవు. ప్రతిసారి ప్రేక్షకులకు కొత్తదనాన్ని చూపించాలి. కొత్త సినిమాలతో ముందుకు రావాలి. అనేదే నా ఆలోచన హనీ మహేష్ బాబు చెప్పడం జరిగింది.

Advertisement

ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను జనవరి 2024న సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు మంచి హిట్ కొట్టాయి. ఇక వీరి కాంబోలో గుంటూరు కారం మూడో సినిమా రాబోతోంది. ఈ సినిమా ఏ మేర హిట్ సాధిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ తీసుకున్న కట్నం ఎంతో తెలుసా.. క్లారిటీ ఇచ్చిన స్నేహ రెడ్డి తండ్రి?

మీ కనుబొమ్మలు ఇలా ఉన్నాయా? అయితే మీరు ధనవంతులు అవుతారు…!

దగ్గుబాటి రానా భార్య మిహికా బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు!

Visitors Are Also Reading