చాణక్యుడి గురించి నేటి తరానికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తరతరాలుగా ఆయన రచించిన అర్ధశాస్త్రంలోని మెళకువలను నేటికీ మనం నేర్చుకుంటున్నాం. కేవలం అర్ధ శాస్త్రం మాత్రమే కాదు బ్రతకడానికి అవసరమైన ఎన్నో జీవిత సత్యాలను కూడా చాణుక్యుడు వివరించాడు. చాణుక్యుడు చెప్పిన నీతి వాక్యాలన్నీ ప్రస్తుతం చాణక్య నీతి అన్న గ్రంధం ద్వారా నేటి తరానికి చేరుతున్నాయి.
Advertisement
“రాజా వేశ్యా యమశ్చఅగ్నిహి
చౌరాః బాలక యాచకః
పర దుఃఖం న జానన్తీ అష్టమో
గ్రామ కర్ణకాః”
ఈ శ్లోకంలో చాణుక్యుడు లోకం లో ఎనిమిది మందికి ఎదుటి వారి దుఃఖం అర్ధం కాదు అని వివరించారు. రాజు, వేశ్య, యముడు, అగ్ని, దొంగ, పిల్లవాడు, భిక్షగాడు, గ్రామ కరణం.. ఈ ఎనిమిది మంది ఎదుటివారి బాధని అస్సలు పట్టించుకోరు అని చాణుక్యుడు వివరించాడు. రాచకార్యాలు నడిపే రాజుకు దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు. అతను కఠినంగా ఉంటేనే పాలనా చేయగలుగుతాడు. అవతలివారి దుఃఖాలను ఓదారుస్తూ కూర్చుంటే పాలనా ఎప్పటికి చేస్తాడు.
Advertisement
అలాగే వేశ్యకు అవతలివారి కష్టంతో పని లేదు. డబ్బుతో మాత్రమే పని ఉంటుంది. పసి పిల్లలకు అవతలి వారి దుఃఖం అర్ధం చేసుకునే జ్ఞానం ఉండదు. దొంగకు తన వృత్తిపైనే మరియు నగలపైనే ధ్యాస ఉంటుంది. ఇంట్లో వాళ్ళ బాధ గురించి అతనికి పట్టదు. బిక్షకుడు అందరి ముందు చేయి చాచటమే పనిగా పెట్టుకుంటాడు. ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోడు. ఇక గ్రామ కరణం గొడవలు పెట్టుకునే వారి మధ్య వివాదపు వినోదాలు చూస్తారు తప్ప అవతలి వారి బాధని పట్టించుకోరు అని ఈ శ్లోకం అర్ధం.
మరిన్ని ముఖ్య వార్తలు:
సీఎం జగన్ పై బాలయ్య సెటైర్లు… టీజర్ లో డైలాగ్స్ వైరల్ ?
మహిళా క్రికెటర్లను పెళ్లి చేసుకున్న ఆటగాళ్లు వీళ్ళే.. ధోని శిష్యుడితో సహా ఎవరెవరంటే?
Aarti Agarwal : ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి వాళ్లే కారణమా..?