Home » ఎవరికీ సాధ్యం కాని పాత్రను పోషించి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్..!

ఎవరికీ సాధ్యం కాని పాత్రను పోషించి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్..!

by Sravya
Ad

ఏ నటుడైనా కూడా కొన్ని రకాల పాత్రను మాత్రమే సరిగ్గా చేయగలుగుతారు. కొన్ని పాత్రలు చేయడానికి ఇష్టపడరు. పైగా అటువంటి పాత్రలో వాళ్ళని వాళ్ళు చూడాలనుకోరు అంత టాలెంట్ లేదని కూడా భావించే వాళ్ళు ఉన్నారు. మహానటుడు ఎన్టీఆర్ వంటి వాళ్ళు ఏ పాత్రలు చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు ఏ పాత్రలోనైనా అద్భుతంగా నటించగలరు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోగలరు. ఛాలెంజింగ్ రోల్స్ తీసుకోవడంలో కూడా ఎన్టీఆర్ ముందుంటారు.

Advertisement

 

ఎన్టీఆర్ తీసుకున్న ఛాలెంజింగ్ పాత్ర ఏంటంటే అది రావణాసురుడి పాత్ర. 1958 లో భూకైలాస్ సినిమాలో ఎన్టీఆర్ రావణాసురుడిగా నటించారు. ఈ సినిమాలో రాముడి ప్రస్తావన ఉండదు. రావణాసురుడు చుట్టూ కథ తిరుగుతుంది. ఈ మూవీ విడుదలైన రెండేళ్ల తర్వాత తను రాముడిగా ఎస్వి రంగారావు రావణాసురుడిగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ఆలోచన ఎన్టిఆర్ కు వచ్చింది. రావణాసురుడు లోని విశిష్టతను తెలియజేసే ఒక పుస్తకాన్ని ఇచ్చారు కృష్ణ చౌదరి. చదివిన తర్వాత ఎన్టీఆర్ కి రావణాసురుడు పాత్ర మీద ఆసక్తి కలిగింది. తను ఆ సినిమాలో రావణ పాత్రను పోషించాలని అనుకున్నారు.

Advertisement

Also read:

దర్శకుడు కె.వి.రెడ్డి మాత్రం కృష్ణుడిగా చూపించిన నిన్ను రావణాసుడిగా చూడలేను పైగా రావణాసురుడు వంటి రాక్షసుడిగా చూపించడం నా వల్ల కాదు అని అన్నారు. ఈ కారణంతో కేవీ రెడ్డి మర్యాదగా తప్పుకున్నారు. అప్పుడు ఎన్టీఆర్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు కానీ దర్శకుడుగా ఆయన పేరు వేసుకోలేదు. సినిమా పేరు సీతారామ కళ్యాణమైనా కూడా కథ మొత్తం రావణాసురుడు చుట్టూ తిరుగుతుంది. ఎన్టీఆర్ రావణాసురుడి పాత్ర చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది ఈ మూవీలో రాముడు పాత్ర ఉన్న కూడా ఎన్టీఆర్ రావణ పాత్ర పోషించడం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. 1961 జనవరి 6న సీతారామ కళ్యాణం విడుదల అయ్యి ఘనవిజయాన్ని సాధించింది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading