Home » మహిళా క్రికెటర్లను పెళ్లి చేసుకున్న ఆటగాళ్లు వీళ్ళే.. ధోని శిష్యుడితో సహా ఎవరెవరంటే?

మహిళా క్రికెటర్లను పెళ్లి చేసుకున్న ఆటగాళ్లు వీళ్ళే.. ధోని శిష్యుడితో సహా ఎవరెవరంటే?

by Srilakshmi Bharathi
Ad

ఏ దేశంలో అయిన క్రికెట్ కు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ క్రికెట్ ఆడే క్రికెటర్స్ కి కూడా అదే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది. వారి గురించిన ప్రతీ వార్తా నెట్ లో హల్ చల్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆర్టికల్ లో లేడీ క్రికెటర్లను పెళ్లి చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్ ను ఓ లుక్ వేద్దాం. ఈ లిస్ట్ లో ధోని శిష్యుడు కూడా ఉన్నాడండోయ్. అతనెవరో తెలియాలంటే ఈ ఆర్టికల్ ను చదివేయండి.

Advertisement

1. రోజర్ ప్రిడోక్స్, రూత్ వెస్ట్‌బ్రూక్:

crickters

 

వీళ్ళిద్దరూ ఎక్కువ కాలం క్రికెట్ ఆడలేదు. అయితే, టెస్ట్ క్రికెట్ లో మాత్రం వీరు తమ దేశమైన ఇంగ్లాండ్ కు ప్రాతినిధ్యం వహించారు. ఇంగ్లాండ్ తరపున రూత్ 11 టెస్టులు ఆడి, 476 పరుగులు చేయగా, ఆమె భర్త రోజర్ మూడు టెస్ట్ లు ఆడాడు. తన కెరీర్ లో ఒక హాఫ్ సెంచరీ తో పాటు మొత్తంగా 102 పరుగులు చేసాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్ లో రోజర్ 25000 కు పైగా పరుగులు చేసాడు.

2. రుతురాజ్ గైక్వాడ్, ఉత్కర్ష పవార్‌:

ruturaj-gaikwad

Advertisement

 

ధోని ప్రియా శిష్యుడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ రుతురాజ్, మహారాష్ట్ర రైజింగ్ స్టార్ ఉత్కర్షలు జూన్ 3 న వివాహం చేసుకున్నారు. గైక్వాడ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ లో స్టాండ్ బై ప్లేయర్స్ లో ఒకడిగా సెలెక్ట్ అయిన రుతురాజ్ పెళ్లి కోసం జట్టుని వదిలేసాడు. ఇందుకు బీసీసీఐ కూడా ఒప్పుకుంది.

3. మిచెల్ స్టార్క్, అలిస్సా హీలీ :

mitchell-starc

 

వీరిద్దరూ ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. ఆస్ట్రేలియా గెలిచిన అనేక టోర్నీలలో వీరి హస్తం కూడా ఉంది. ఈ పవర్ కపుల్ కొన్ని ఆస్ట్రేలియన్ అవార్డ్స్ ఫంక్షన్స్ లో కూడా కనిపించి సందడి చేస్తుంటారు.

4. గై డి అల్విస్, రసాంజలి సిల్వా:

 

గై డి అల్విస్ శ్రీలంక మాజీ వికెట్ కీపర్. రసాంజలి ఆ దేశ విమెన్ క్రికెటర్. ఆమె శ్రీలంక తరపున ఒక టెస్టు, 22 ODIలు ఆడారు. ఆమె రిటైర్ అయ్యాక శ్రీలంక మహిళల జట్టుకు సెలక్టర్‌గా కూడా పని చేసారు. కాగా, గై డి 11 టెస్టులు, 31 ODIలు ఆడారు. అయితే, ఆల్విన్ 2013 లో 52 సంవత్సరాల వయసులో మరణించారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

Aarti Agarwal : ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి వాళ్లే కారణమా..?

ఆదిపురుష్” సినిమా ఫస్ట్ రివ్యూ…ఎలా ఉందంటే…?

4 గురు పెళ్ళాలు ఉన్నా… ఒంటరోడే నా దేవుడు – శ్రీ రెడ్డి

Visitors Are Also Reading