Home » Aarti Agarwal : ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి వాళ్లే కారణమా..?

Aarti Agarwal : ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి వాళ్లే కారణమా..?

by Bunty
Ad

ఆర్తి అగర్వాల్ గురించి తెలియనివారు ఉండరు. అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోలు అందరి సరసన జతకట్టి మెప్పించారు. అతి చిన్న వయసులోనే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆర్తి అగర్వాల్ మార్చి 5న 1984లో అమెరికాలో జన్మించారు. 16 ఏళ్ల వయసులో ఇండియాకి వచ్చింది ఆర్తి అగర్వాల్. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయింది. 2001 లో పాగల్పన్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఆర్తి అగర్వాల్. ఈ సినిమాలో అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు పొందింది. సరిగ్గా అదే సమయంలో వెంకటేశ్ సరసన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో నటించి తెలుగు పరిశ్రమకు పరిచయమైంది ఆర్తి అగర్వాల్.

tarun-and-aarthiagawal-love

Advertisement

 

ఆ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత చిరంజీవి, ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, తరుణ్, మహేష్ బాబు, బాలకృష్ణ సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా నటించింది ఈ అమ్మడు. అలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆర్తి అగర్వాల్ ఒక యువ హీరోతో ప్రేమలో పడింది. ఆ హీరో ఈమె ప్రేమను నిరాకరించడంతో మానసికంగా కృంగిపోయింది. ఆ బాధను భరించలేక ఆర్తి అగర్వాల్ సూసై*డ్ చేసుకుంది. కానీ ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత 2007 లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. అయితే ఆ వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవలేదు.

Advertisement

 

మనస్పర్ధల వల్ల 2009లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించాలని ఆసక్తి చూపించింది. కానీ అధిక బరువు పెరగడం వల్ల సినిమాలో అవకాశాలు రాలేదు. దీంతో బరువు తగ్గించుకోవడం కోసం సర్జరీ చేయించుకుంది. ఆ సర్జరీ తర్వాత ఆర్తి అగర్వాల్ చాలా బరువు తగ్గింది. మరికొన్ని రోజులకి మరికొంత బరువు తగ్గేందుకు మళ్ళీ సర్జరీ చేయించుకోవాలనుకుంది. ఆ సర్జరీ వల్ల బరువు తగ్గడంతో పాటు శ్వాసకోస వ్యాధి కూడా దూరమవుతుందని భావించిన ఆర్తి అగర్వాల్ హాస్పిటల్ లో చేరింది. ఆ సర్జరీ తర్వాత ఆర్తి అగర్వాల్ నడవలేక, ఊపిరి తీసుకోలేక చాలా ఇబ్బంది పడింది. దాంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించందని వైద్యులు నిర్ధారించారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

ఆ నటికి చెవిటి, మూగ..! కానీ ఒకే ఒక్క సినిమాతో

అప్సర కేసులో అదిరిపోయే ట్విస్ట్! ఇది అస్సలు ఊహించలే కదా ?

4 గురు పెళ్ళాలు ఉన్నా… ఒంటరోడే నా దేవుడు – శ్రీ రెడ్డి

Visitors Are Also Reading