Home » అశ్విన్ లీలలు.. బయటపెట్టిన స్టార్ స్పిన్నర్ భార్య !

అశ్విన్ లీలలు.. బయటపెట్టిన స్టార్ స్పిన్నర్ భార్య !

by Bunty
Ad

 

 

 

టీమిండియా స్టార్ క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి తెలియని వారు ఉండరు. రవిచంద్రన్ అశ్విన్… ప్రస్తుతం టీమిండియాలో రేంజ్ ఫార్మ్ కొనసాగిస్తున్నాడు. తన గూగ్లీ అలాగే ఆఫ్ స్పిన్, లెగ్స్ స్పిన్ బాల్స్ తో బ్యాట్స్మెన్లను బెంబేలెత్తి ఇస్తున్నాడు రవిచంద్రన్ అశ్విన్. టీమిండియాలోనే కాకుండా… ఐపీఎల్ లోను బాగా రాణిస్తున్నాడు రవిచంద్రన్ అశ్విన్. ప్రస్తుతం ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు అశ్విన్.

Advertisement

అంత ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు అశ్విన్. అయితే ఇటీవల జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ లో అశ్విన్ సెలెక్ట్ అయినప్పటికీ.. అతనికి తుది జట్టులో స్థానం దక్కలేదు. ఇది ఇలా ఉండగా తాజాగా రవిచంద్రన్ అశ్విన్ పై అతని భార్య ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ తో పరిచయం మరియు వారి మధ్య జరిగిన ప్రేమాయణం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆయన గురించి కీలక వ్యాఖ్యలు చేసింది అశ్విన్ భార్య ప్రీతి. రవిచంద్రన్ అశ్విన్, తాను ఒకే స్కూల్లో చదువుకునే వాళ్ళమని వెల్లడించింది ప్రీతీ. స్కూల్ సమయం నుంచి తామిద్దరం బాగా క్లోజ్ అని… తనకు అశ్విన్ అంటే చచ్చేంత ప్రేమ అని ప్రీతి వెల్లడించింది. 7 వ తరగతిలోనే ఇద్దరం పడ్డామని తెలిపింది.

Advertisement

ఈ విషయం స్కూల్ మొత్తం తెలుసని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే కొన్ని రోజుల తర్వాత క్రికెట్ ట్రైనింగ్ కోసం తాము చదివే స్కూల్ వదిలి… వేరే స్కూల్ వెళ్లాడట అశ్విన్. దీంతో తమ మధ్య దూరం పెరిగిందని ప్రీతి వెల్లడించింది. అయితే చాలా రోజుల తర్వాత అంటే తాను ఉద్యోగం చేసే క్రమంలో మళ్లీ అశ్విని పరిచయమైనట్లు తెలిపింది. ఉద్యోగంలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ టీం అకౌంటు హ్యాండిల్ చేసేందుకు వెళ్లగా అక్కడ అశ్విన్ మరోసారి కనిపించినట్లు గుర్తు చేసింది ప్రీతి. ఇక అప్పుడే.. తమ ప్రేమ మళ్ళీ చిగురించిందని స్పష్టం చేసింది. ఈ తరుణంలోనే తనను గ్రౌండ్ లోకి తీసుకుపోయి ప్రపోజ్ చేసినట్లు పేర్కొంది అశ్విన్ భార్య. ఆ తర్వాత తామిద్దరం పెళ్లి చేసుకుందామని… ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్లు స్పష్టం చేసింది అశ్విన్ భార్య ప్రీతి.

Visitors Are Also Reading