తాజాగా తెలంగాణ ప్రభుత్వం చేతి వృత్తులు, బిసి కుల వృత్తులు చేసుకునే వారికి లక్ష రూబయలు ఆర్ధిక సాయం అందివ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకోసం అఫిషియల్ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెబ్ సైట్ ని కూడా ప్రారంభించారు. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే వారు తమకు అవసరమైన పనిముట్లు, ముడి సరుకులను కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం ఈ సాయం అందిస్తున్నట్లు తెలిపింది.
Advertisement
అయితే ఈ ఆర్థిక సాయం పొందాలనుకున్న వారు మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించిన వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేయాలి. మీ నియోజక వర్గం, జిల్లా, మండలం, పంచాయితీ, గ్రామం, హౌస్ నెంబర్ తో సహా ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆధార్ కార్డును అనుసరించి మీ పేరు, ఇతర వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల వారు అర్బన్ అని, పట్టణ ప్రాంతాల వారు రూరల్ అని అప్లై చేయాలి. చదువుకుని ఉంటె విద్యార్హతలు మెంతిఒన్ చేయాలి. లేకుంటే నిరక్షరాస్యులని తెలపాలి.
Advertisement
అలాగే క్యాస్ట్ పేరు, క్యాస్ట్ ధ్రువీకరణ పత్రాలను కూడా సబ్మిట్ చేయాలి. బ్యాంకు ఖాతా సంఖ్యా, ఎఫ్సీఐఎస్ కోడ్, బ్యాంకు పేరు, బ్యాంకు శాఖ వివరాలను కూడా తెలపాల్సి ఉంటుంది. చివరగా, పాన్ నెంబర్ తో పాటు దరఖాస్తు దారుని ఫోటో కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ వివరాలను అధికారులు తనిఖీ చేసిన తరువాత మీరు అర్హులు అయితే, అధికారులు మీ బ్యాంకు ఖాతాకు డబ్బులు జమ చేస్తారు.
మరిన్ని ముఖ్య వార్తలు:
సినిమాల్లోకి రాకముందు కృతిశెట్టి డబ్బుల కోసం ఆ పని కూడా చేసిందా ?
మెగాస్టార్ అలా చేయడం వల్లే ఆ పవన్ కళ్యాణ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందా? అసలు విషయం ఏంటంటే?
Lavanya Tripati : కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటో తెలుసా ?