Home » Lavanya Tripati : కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటో తెలుసా ?

Lavanya Tripati : కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటో తెలుసా ?

by Bunty
Ad

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. 2016 నుంచి ఈ జంట ప్రేమలో ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు ప్రచారం జరిగింది. అంతరిక్షం సినిమా సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డట్లు కథనాలు కూడా వచ్చాయి. అటు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని… గత నెల వరకు వార్తలు గుప్పు మన్నాయి. ఈ క్రమంలో హీరో వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ కార్యక్రమం జూన్ 9వ తేదీన చాలా గ్రాండ్ గా జరిగింది.

Advertisement

ఇక ఈ వేడుకకు మెగా కుటుంబం అలాగే అల్లు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అల్లు మరియు మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఎంగేజ్మెంట్ కార్యక్రమం నేపథ్యంలో ఏకంగా 25 లక్షల విలువైన రింగ్ ను లావణ్య త్రిపాటికి… హీరో వరుణ్ తేజ తొడిగినట్లు సమాచారం అందుతుంది. అలాగే ఈ తరుణంలోనే… లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటని తాజాగా కొత్త చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూలో పాల్గొని తన క్యాస్ట్ గురించి పేర్కొంది.

Advertisement

లావణ్య త్రిపాఠి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హీరోయిన్. లావణ్య త్రిపాఠి ది బ్రాహ్మణ కులం. డెహ్రాడూన్ లో పుట్టి పెరిగింది. ఇక లావణ్య త్రిపాఠి తండ్రి హైకోర్టులో న్యాయవాది. ఆమె తల్లి రిటైర్డ్ టీచర్. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి కి ఒక చెల్లెలు అలాగే సోదరుడు ఉన్నాడు. తన క్యాస్ట్ గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ…. మనసులో మధ్య బంధం, బంధుత్వం ఉండాలి తప్ప కులాలు చూడకూడదని ఆమె పేర్కొన్నారు. ఏ కులం మనుషులైనా వారి ఒంట్లో ప్రవహించేది రక్తమే అని సినిమా డైలాగులు చెప్పారు లావణ్య త్రిపాఠి.

Visitors Are Also Reading