నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం బంగార్రాజు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించింది. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అంతే కాకుండా సొంత బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాను నిర్మించారు. ఇక సోగ్గాడే చిన్నినాయన సినిమా లో కేవలం నాగార్జున హీరోగా నటించగా ఈ సినిమాలో నాగచైతన్య కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. కృతి శెట్టి నాగచైతన్య కు జోడిగా నటించింది. ఇక ఈ చిత్రాన్ని జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Advertisement
అంతేకాకుండా ఇప్పటికే సినిమా టీజర్ మరియు కొన్ని పాటలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ మరియు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక త్వరలో సినిమా విడుదల నేపథ్యంలో నాగార్జున ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున నేడు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాగార్జున ఏపీ టికెట్ల అంశంపై స్పందించారు.
Advertisement
Also read : నాకు కొడాలి నాని తెలియదు..ఆర్జీవీ మరో కౌంటర్..!
ఏపీలో టిక్కెట్ల ధరల పై జరుగుతున్న వివాదం పై మీరు ఎలా స్పందిస్తారు అని నాగార్జునను ప్రశ్నించగా..సినిమా ఫంక్షన్ల స్టేజ్ పై రాజకీయాలు మాట్లాడ కూడదు అని నాగార్జున అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలు గిట్టుబాటు అవుతాయా అని ప్రశ్నించగా..? తమ సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదని రేటు ఎక్కువగా ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయని తక్కువగా ఉంటే తక్కువ డబ్బులు వస్తాయని పేర్కొన్నారు. కరోనా సమయంలో థియేటర్ల పై ఆంక్షలు ఉన్నాయని సినిమాని జేబులో పెట్టుకుని కూర్చో లేము కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది ఇలా ఉంటే ఏపీలో టిక్కెట్ల ధరలను పెంచాలని పలువురు సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ విమర్శించిన సంగతి తెలిసిందే.