Home » నాకు కొడాలి నాని తెలియ‌దు..ఆర్జీవీ మ‌రో కౌంటర్..!

నాకు కొడాలి నాని తెలియ‌దు..ఆర్జీవీ మ‌రో కౌంటర్..!

by AJAY

తెలంగాణ‌లో టికెట్ల ధ‌ర‌లు అమాంతం పెరిగితే ఏపీలో ధ‌ర‌ల‌ను ప్రభుత్వం నియంత్రిస్తోంది. దాంతో ఏపీ టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచాల‌ని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ మంత్రుల‌పై ఆర్జీవీ వ‌రుస ట్వీట్ల‌తో రెచ్చిపోతున్నారు. ఇప్ప‌టికే మంత్రి పేర్ని నానిపై ఆర్జీవి సెటైర్ల వ‌ర్షం కురిపించిన సంగ‌తి తెలిసిందే. టికెక్ ధ‌ర‌ల‌ను ఎందుకు పెంచ‌ట్లేదో పేర్నినాని వివ‌రిస్తూ వ‌ర‌స ట్వీట్లు చేయ‌గా ఆర్జీవి సైతం ప‌దుల సంఖ్య‌ల ట్వీట్లు చేసి స‌మాధానాలు చెబుతూ తిరిగి ప్ర‌శ్న‌లు కురిపించారు.

kodali nani rgv

kodali nani rgv

ఇక తాజాగా ఆర్జీవీ ఏపీకి చెందిన మ‌రో మంత్రిపై కౌంట‌ర్ వేశారు. ప‌లువురు నెటిజ‌న్లు ఆర్జీవిని కొడాలి నాని కౌంట‌ర్ కు స‌మాధానం చెప్పాలని కోరారు. దాంతో ఆర్జీవి త‌న‌దైన స్టైల్ లో కౌంట‌ర్ ఇస్తూ ట్వీట్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌ధేశ్ టికెట్ రేట్ల విషయం లో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కు సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు.

also read : కూతురు సినిమాకు మెగాస్టార్ రివ్యూ..అద్భుతం అంటూ..!

నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ నాని ఒక్కడే ..వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు. అంటూ పేర్నొన్నారు. ఇక ఇప్ప‌టికే ఏపీ టికెట్ల విష‌యం పై సోష‌ల్ మీడియాలో ర‌చ్చ జ‌రుగుతోంది. ఇప్పుడు ఆర్జీవి ఏకంగా కొడాలి నానిని సైతం లాగ‌టంతో కొడాలి ఏ విధంగా స్పందిస్తారా అన్న ఆస‌క్తి నెల‌కొంది.

Visitors Are Also Reading