ప్రస్తుత కాలంలో చాలామంది తెలిసో తెలియకో ఆయిల్ ఫుడ్డుకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. కనీసం తినాల్సినవి తినకుండా శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. మానవ శరీరంలో అత్యంత సున్నితమైనటువంటి భాగాల్లో కళ్ళు కీలక పాత్రను పోషిస్తాయి. అలాంటి కళ్లను కూడా చాలామంది నెగ్లెట్ చేస్తూ వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు.. కనీసం కళ్ల విలువ కూడా తెలియట్లేదు. కళ్ళు లేని వారిని అడిగితే కంటి చూపు ఎంత ముఖ్యమో కళ్ళు లేకుంటే బాధ ఏంటో చెబుతారు.
Advertisement
అలాంటి కంటిచూపు బాగుండాలంటే మనం ఇలాంటి ఆహార పదార్థాలు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుత కాలంలో ఆహార అలవాట్లతో పాటు టీవీ,సెల్ ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల చిన్న వయసులోనే కంటి చూపు ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి సమయంలో రోజుకు అయిదు వాల్ నాట్స్ నానబెట్టుకుని ఉదయాన్నే తినాలి. దీనివల్ల కంటి చూపు రెట్టింపు అవుతుంది.
Advertisement
అలాగే పాలకూర కూడా కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే వారానికి రెండుసార్లు చేపలు, క్యారెట్ తినాలి.కంటి చూపుమెరుగు అవుతుంది. అలాగే అవకాడో కంటి చూపును మెరుగుపరుస్తుంది. మెదడును చురుగ్గా ఉంచడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమంది దుంపలు వంటి ఆహారాన్ని అవాయిడ్ చేస్తారు. కానీ ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడతాయట. కాబట్టి కళ్ళు చక్కగా కనిపించాలంటే రోజు డైట్ లో ఈ ఆహారం ఉండేలా చూసుకోండి.
మరికొన్ని ముఖ్య వార్తలు :
- ధోనీ బౌలింగ్.. కోహ్లీ కీపింగ్ చేశారనే విషయం మీకు తెలుసా ?
- బ్రహ్మానందం కి కాబోయే కోడలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థికంగా లాభాలుంటాయి