అంబటి రాయుడు గురించి తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు ఇప్పుడు రాజకీయాల వైపు చూస్తున్నాడు. ఇప్పటికే ఈ విషయంపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. వైసీపీలో చేరేందుకు అంబటి రాయుడు ఆసక్తి చూపిస్తున్నారని ప్రకటనల ద్వారా తెలిసింది. ఈ మేరకు వైసిపి పెద్దలతో అంబటి సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఏపీ నుంచి వైసీపీ తరపున బరిలోకి దిగాలని అనుకుంటున్నారు. కానీ అంబటిని తెలంగాణ నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు అంబటితో సంప్రదింపులు చేస్తున్నారట.
Advertisement
అంబటినీ కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు హజారుద్దీన్ కు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అంబటిని మల్కాజ్గిరి నుంచి ఎంపీగా కాంగ్రెస్ తరపున బరిలోకి దింపాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో బలమైన నేత కోసం అంబటి అయితే బాగుంటుందని పార్టీ పెద్దలు నిశ్చయించారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అంబటి రాయుడు ఏపీకి చెందిన వ్యక్తి. పైగా కాపు సామాజిక వర్గం. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఏపీకి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఎక్కువగా ఉన్నారు.
Advertisement
ఏపీకి చెందిన వ్యక్తి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అంబటి రాయుడు గెలుపు సులభం అవుతుందని కాంగ్రెస్ అంచనా. అందుకే అంబటి రాయుడిని కాంగ్రెస్ లోకి తెచ్చి… మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నారు. అజారుద్దీన్ తో చర్చల అనంతరం ఈ విషయంపై క్లారిటీ రానుంది. మరోవైపు అంబటి రాయుడు సొంత రాష్ట్రం అయినా ఏపీ వైపు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అధికార వైసీపీ నుంచి గుంటూరు బరిలో నిలవాలని అనుకుంటున్నారు. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి కూడా అంబటి విషయంలో సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయాలకు సంబంధించి అందరికీ రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇక అంబటి ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
టీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఎంత చదువుకున్నారో తెలుసా…?
కిమ్ కు భయంకరమైన వ్యాధి… బరువు 140 కిలోలు పెరిగాడా!
పెళ్లికి ముందు కోహ్లీతో రోహిత్ భార్య డేటింగ్?