కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని అందుకుంది. 1990 తర్వాత కాంగ్రెస్ కు ఇదే పెద్ద విజయం కావడం విశేషం. సింపుల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి… కర్ణాటక విజయం ఊపిరి పోసినట్టు అయింది. ఏకంగా 135 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి రాబోతోంది.
Advertisement
అయితే ఇప్పటివరకు అంతా బాగున్నా… కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై ఇవాల్టి వరకు తీవ్ర సందిగ్ధత నెలకొంది. అయితే ఎన్నో మంతనాలు చేసినా కాంగ్రెస్ అధిష్టానం… చివరికి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై తేల్చి పారేసింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సీనియర్ లీడర్ సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఉండనున్నారు.
Advertisement
అలాగే 2024 లోక్ సభ ఎన్నికల వరకు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివకుమార్ కొనసాగనున్నారు. ఈ విషయాలను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ వెల్లడించారు. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం గా శివకుమార్, కొందరు మంత్రులు ఈనెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన వెల్లడించారు. కాగా, ఈనెల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుని ఘనవిజయం సాధించింది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
ఏసీ వాడకంలో ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్ తక్కువ వస్తుంది!
BRO : పవన్, సాయిధరమ్ తేజ్ సినిమా టైటిల్ ఇదే… ‘బ్రో’