Home » పెళ్లయిన తర్వాత కూడా మీ ఎక్స్ కల్లోకి వస్తున్నారా..అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..?

పెళ్లయిన తర్వాత కూడా మీ ఎక్స్ కల్లోకి వస్తున్నారా..అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..?

by Sravanthi
Ad

ప్రతి ఒక్కరికి నిద్రలో కలలు వస్తుంటాయి. అయితే వాటిని చాలా మంది గుర్తుంచుకోలేరు. నిద్రలో వచ్చిన చాలా కలలను నిద్ర నుండి మేల్కోన గానే మర్చిపోతూ ఉంటారు. అలాగే వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే కొన్ని రకాల కలలు తరచు వస్తుంటే మాత్రం వాటిని గమనించి జాగ్రత్తగా ఉండాలంటున్నారు కలాశాస్త్ర నిపుణులు. సాధారణంగా ప్రతి మనిషికి కలలు వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం మనకు కొన్ని సమయాల్లో వచ్చే కలలు నిజమవుతాయని అంటుంటారు. మరి కలలు ఎందుకు వస్తాయి. కలలో వచ్చేదంతా నిజంగా జరుగుతుందా..

also read:వెంకటేష్, నానితో సుధీర్ బాబు పోటీ పడనున్నారా ?

Advertisement

అనేది ఇప్పటికి ఎవరికి తెలియదు.. అయితే కొంతమందికి పెళ్లి తర్వాత కూడా తన ఎక్స్ బాయ్ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ కల్లోకి వస్తుంటారు.. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.. మీకు తరచుగా మీ మాజీ గురించి కలలో కనిపిస్తూ ఉంటే చాలామంది బాధపడిపోతూ ఉంటారు. అలా మీ మాజీ కలలో ఎందుకు కనిపిస్తుంది అనే విషయంలోకి వెళ్తే.. మీరు ఆమెతో విడిపోయిన తర్వాత కూడా మీ అప్పటి బంధానికి సంబంధించిన విషయాలను మీరు మర్చిపోలేదని అర్థం. మళ్లీ మీ జీవితంలో అలాగే జరుగుతుందని మీరు పదే పదే ఆందోళన చెందుతూ ఉంటారని అర్థం.

Advertisement

also read:“పుష్ప 2” లో ఐటమ్ సాంగ్లో ఆ హాట్ బ్యూటీ… హింట్ కూడా ఇచ్చేసింది..?

సాధారణంగా మనకు వచ్చే కలలు గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించి మాత్రమే ఉంటాయి. కాబట్టి ప్రస్తుతాన్ని గతంతో పోలుస్తూ, ఈ విధంగా కలలు వస్తూ ఉంటే మీ మాజీకి ఫోన్లు, మెసేజ్లు చేయమని కాదు. అలా మీ మాజీ తరచూ గుర్తుకు వస్తూ ఉంటే వీలైనంతవరకు ఆమె నుంచి మీరు ఇంకా దూరం కావడానికి ట్రై చేయాలి. ఆమె జ్ఞాపకాలను వదిలేయాలి. మీకు వివాహమైనట్లయితే మీ భార్య మీ పిల్లలను హ్యాపీగా చూసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మీకు మాజీలు కలలో కనిపించకుండా ఉంటారు.

also read:బాలీవుడ్ లో తొలి సినిమాకే ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading