తాత నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అంది పుచ్చుకొని తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించారు జూనియర్ ఎన్టీఆర్. మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీని నందమూరి కుటుంబం దగ్గరికి తీసుకోలేదు. అయినా జూనియర్ ఎన్టీఆర్ తాత పేరు నిలబెట్టడం కోసం కష్టపడి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారారు.
also read:మెగా ఫ్యామిలిలో కల్లోలం.. ప్రియుడి ఫోటోలను షేర్ చేసిన నిహారిక ?
Advertisement
ఇప్పుడు ఆయనను మా నందమూరి హీరో అంటూ చెప్పుకుంటున్నారు కానీ ఆయన స్టార్డం రాకుంటే దగ్గరికి రాణించేవారు కాదేమో అని కొంతమంది అంటుంటారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తన తాత నుంచి వారసత్వంగా కొంత ఆస్తి కూడా వచ్చిందట. ఇటీవల ఈ విషయాన్ని కొడాలి నాని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎన్టీ రామారావు గారు తన వారసులందరికీ సమానంగా ఆస్తులు పంచారు. సొంత ఊరైన నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఐదు ఎకరాల పొలం రాసిచ్చారట.
Advertisement
also read:శేఖర్ మాస్టర్ ఒక్క పాటకి ఎంత పారితోషికం తీసుకుంటారో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!
ఇప్పటికీ ఆ పొలం అలాగే ఉందని నాని తెలియజేశారు. ఇప్పుడు ఆ పొలం ఖరీదు రూ.7.5 కోట్ల నుంచి 10 కోట్ల వ్యాల్యూ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ పొలాన్ని ఎన్టీఆర్ పట్టించుకోవడంలేదని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి 60 కోట్ల పారితోషికం తీసుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరో హోదాలో కొనసాగుతున్నారు.
also read:మెగా ఫ్యామిలిలో కల్లోలం.. ప్రియుడి ఫోటోలను షేర్ చేసిన నిహారిక ?