హైదరాబాద్ వేదికగా ఆదివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 99 పరుగుల వద్ద నాటౌట్ గా నిలిచాడు. 99 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద టీమ్ ఇన్నింగ్స్ ముగిసిపోవడంతో ధావన్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దీంతో ధావన్ ఓ అరుదైన లిస్ట్ లో చేరాడు. 99 పరుగుల వద్ద నాటౌట్ గా నిలిచిన ఐపీఎల్ ప్లేయర్ల జాబితా ధావన్ చోటు సంపాదించుకున్నాడు. అతని కంేట ముందు ఈ టిస్ట్ లో ముగ్గురు ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు వారెవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : IPL ల్లో చాహల్ బిజీ…. శ్రేయస్ తో మళ్ళీ చాహల్ భార్య అడ్డంగా దొరికిపోయిందిగా!
Advertisement
సురేష్ రైనా :
మిస్టర్ ఐపీఎల్ గా ప్రసిద్ధి చెందిన సురేష్ రైనా. ఐపీఎల్ టోర్నీ చరిత్రలోనే 99 పరుగుల వద్ద నాటౌట్ గా నిలిచిన ఫస్ట్ ఆటగాడిగా నిలిచాడు. 2013 ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అజేయంగా 99 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 223/3 పరుగులు సాధించింది. అదేవిధంగా 77 పరుగుల తేడాతో సీఎస్కే మ్యాచ్ గెలిచింది.
Advertisement
Also Read : IPL 2023 : ఏమైంది రోహిత్..ధోని దెబ్బకు ముఖం చాటేశావా !
క్రిస్ గేల్ :
ఐపీఎల్ 2019లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన క్రిస్ గేల్ తన మాజీ ఐపీఎల్ జట్టు అయినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాటౌట్ గా నిలిచాడు. మొహలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ 64 బంతుల్లో 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. 99 పరుగుల వద్ద నిలిచిన రెండో ఆటగాడిగా క్రిస్ గేల్ నిలిచాడు.
మయాంక్ అగర్వాల్ :
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 99 పరుగులు నాటౌట్ తరువాత రెండేళ్ల అనంతరం పంజాబ్ కింగ్స్ జట్టుకు చెందిన మరో ఆటగాడుకు కూడా ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. పంజాబ్ తరపున ఆడిన మయాంక్ అగర్వాల్ ఢిల్లీ క్యాపిటల్స్ పై 58 బంతుల్లో అజేయంగా 99 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో కూడా పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.