Home » కోపంతో జబర్దస్త్ స్టేజ్ వదిలి వెళ్లిన ఇంద్రజ.. కారణం ఏంటో తెలుసా ?

కోపంతో జబర్దస్త్ స్టేజ్ వదిలి వెళ్లిన ఇంద్రజ.. కారణం ఏంటో తెలుసా ?

by Anji
Ad

బుల్లితెరపై జబర్దస్త్ షో చేసే సందడి మామూలు కాదు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ.. టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకెళ్తోంది. ఈ షో దాదాపు పదేళ్లుగా ప్రసారం అవుతున్నప్పటికీ జనాలకు వినోదం గ్యారంటీ అనేలా ఉంది. జడ్జీలు, కంటెస్టెంట్, యాంకర్ లు మారినా ఈ షో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇంతలా నవ్వించే ఈ ప్రోగ్రామ్ కాస్త సీరియస్ నెస్ కూడా ఉంటుంది. జబర్దస్త్ లో కామెడీనే ఉంటుంది కదా అనుకుంటే.. పొరపాటే అవుతుంది. అప్పుడప్పుడు ఈ స్టేజ్ మీద కంటెస్టెంట్ లకి, జడ్జీలకు మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతాయి. 

Also Read :  డబ్బు కోసం భార్య ప్లాన్ వింటే ఆశ్చర్యపోకుండా ఉండరు.. చివరికీ ఏమైందంటే ?

Advertisement

 

గతంలో రోజా, నాగబాబు సైతం కంటెస్టెంట్ మీద ఫైర్అయినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కంటెస్టెంట్ మీద ఉన్న కోపంతో ఇంద్రజ స్టేజ్ వదిలి వెళ్లిపోయింది. ఎప్పటిమాదిరిగానే ఈసారి జబర్దస్త్ ప్రోమో వచ్చింది. ఏప్రిల్ 13కి సంబంధించిన ఎపిసోడ్ కాస్త ఆసక్తి కలిగించేలా ఉంది. ప్రారంభంలో నవ్విస్తూ.. సాగిన ఈ షో చివరిలో ట్విస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పాపులర్ షో లో కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇంద్రజ తాగుబోతు రమేష్, వెంకీ టీమ్ కి కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్కుల విషయంలో వీరి టీమ్ కి 10కి 9 పాయింట్స్ ఇచ్చారు. 

Advertisement

Also Read :  మీ ఇంట్లో పిల్లల ముందు ఇలాంటి పనులు చేస్తున్నారా.. అయితే వెంటనే మానుకోండి..?

దీంతో కంటెస్టెంట్ వెంకీ మేము 100 శాతం మంచి ప్రదర్శనతో నవ్వించినా మాకు ఎందుకు 10 మార్కులు ఇవ్వలేదని ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే వెంకీ అలా ప్రశ్నించడంతో ఇంద్రజ అసహనంతో కృష్ణ భగవాన్ 9 మార్కులు ఇచ్చారు. ఆయనను అడగకుండా నన్నే ఎందుకు అడుగుతున్నారు అని బదులిచ్చింది. మీ కన్నా వారు బాగా చేశారు అందుకే మీకు తక్కువ మార్కులు ఇచ్చాను అని చెప్పుకొచ్చింది. అదేపనిగా వెంకీ వాదించడంతో ఇంద్రజ సీట్ లో నుంచి లేచి వెళ్లిపోయింది. ఇది కూడా టీఆర్పీ స్టంట్ హా లేక నిజంగానే ఇంద్రజకు కోపం వచ్చిందా ? ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే గురువారం వరకు వేచి చూడాల్సిందే. 

Also Read :  భార్య‌భ‌ర్త‌ల బంధం బ‌లంగా ఉండాలంటే పాటించాల్సిన 5 సూత్రాలు ఇవే..!

Visitors Are Also Reading