Home » మీ ఇంట్లో పిల్లల ముందు ఇలాంటి పనులు చేస్తున్నారా.. అయితే వెంటనే మానుకోండి..?

మీ ఇంట్లో పిల్లల ముందు ఇలాంటి పనులు చేస్తున్నారా.. అయితే వెంటనే మానుకోండి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మొక్కై వంగనిది మ్రానై వంగునా అంటారు పెద్దలు.. ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఈ విధంగానే ఉంటారు. తల్లిదండ్రులు చిన్నప్పటినుంచి ఏ విధమైన అలవాట్లు చేస్తే పిల్లలు కూడా ఆ విధంగానే పెరుగుతారు. కొంతమంది తల్లిదండ్రులు మా పాప ఎక్కువగా ఫోన్ పడుతుంది, మా బాబు పూర్తిగా టీవీ చూస్తున్నాడు, పొద్దున లేవడం లేదు, చెప్పిన పనులు అస్సలు చేయడం లేదు, మారం చేస్తున్నారంటూ కౌన్సిలింగ్ నిపుణులతో బాధలు చెబుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులే నట. తల్లిదండ్రుల ప్రవర్తన వల్లే పిల్లలు ఈ విధంగా తయారవుతారని నిపుణులు అంటున్నారు.. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ముందు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

Advertisement

Also Read:గొడవ కి ఫుల్ స్టాప్ పెట్టిన విరాట్-షారూఖ్.. ఫ్యాన్ ఖుషీ..!

ఆహారం విషయం :

చాలా ఇండ్లలో పిల్లలు చిన్నతనం నుంచే ఊబకాయం సమస్యతో బాధపడతారు. దీనికి ప్రధాన కారణం జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకొని వ్యాయామం చేయకపోవడం. ఇక పిల్లలకు ఆకలి అయిందంటే కొంతమంది తల్లులు రెండు నిమిషాల్లో అయిపోతుంది అని నూడిల్స్ చేసి పెడుతుంటారు. దీనివల్ల వారి ఆకలి మందగిస్తుంది. అయితే కొంతమంది తల్లిదండ్రులు లేటుగా లేస్తూ ఉంటారు. వీరే లేటుగా లేస్తే పిల్లలు ముందుగా ఎలా లేస్తారు.. ఏ విషయంలో అయినా మీరు ఆచరిస్తే పిల్లలు పాటిస్తారనేది తప్పక తెలుసుకోవాలి..
మొబైల్ వాడకం :


చాలా ఇండ్లలో తల్లిదండ్రులు చేతిలో మొబైల్ పట్టుకొని నిత్యం దాన్ని చూస్తూ గడుపుతూ ఉంటారు. ఒకవేళ పిల్లలు మారం చేస్తే వారికి కూడా అదే మొబైల్ చూపిస్తూ ఉంటారు. దీంతో పిల్లలు కూడా ఆ మొబైల్ కు అలవాటు పడిపోతారు. కాబట్టి పిల్లల ముందు పెద్దలు ఎక్కువగా మొబైల్ ఉపయోగించరాదని అంటున్నారు నిపుణులు.
బూతులు మాట్లాడడం :

Also Read:రష్మికకు ఉంగరం తొడిగిన విజయ్ దేవరకొండ.. ఇక జరిగేది పెళ్లేనా..?

చాలామంది తల్లిదండ్రులు గొడవ పెట్టుకున్నప్పుడు వివిధ రకాల బూతులు మాట్లాడుతూ పిల్లల ముందే కొట్టుకుంటారు. దీనివల్ల పిల్లలు కూడా ఆ విధంగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు.
మద్యం ధూమపానం :


కొన్ని ఇండ్లలో తల్లిదండ్రులు పిల్లల ముందే మద్యం తాగుతూ ధూమపానం చేస్తూ ఉంటారు. దీన్ని చూసిన పిల్లలు మా తల్లిదండ్రులు చేస్తున్నారు కదా మేము చేస్తే తప్పేంటి అనే భావనలోకి వెళ్లిపోతారట. అలా స్లోగా అలవాటు చేసుకుని దానికి అడిక్ట్ అవుతారట .
అలాంటి పనులు చేయడం:

Also Read:“సమరసింహారెడ్డి”లో నటించిన ఈ అమ్మాయికి రామ్ చరణ్ కి మధ్య ఇలాంటి రిలేషన్ ఉందా..?

కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందే అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హ* చేసుకోవడం, ము* పెట్టుకోవడం, ఇతరత్రా పనులు చేయడం చేస్తూ ఉంటారు. దీని వల్ల కూడా పిల్లలు చెడు ఆలోచనల బారిన పడతారని నిపుణులు అంటున్నారు.

Visitors Are Also Reading