Home » డబ్బు కోసం భార్య ప్లాన్ వింటే ఆశ్చర్యపోకుండా ఉండరు.. చివరికీ ఏమైందంటే ?

డబ్బు కోసం భార్య ప్లాన్ వింటే ఆశ్చర్యపోకుండా ఉండరు.. చివరికీ ఏమైందంటే ?

by Anji
Ad

కొంతమంది సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏ పని చేయడానికి అయినా సిద్ధపడుతుంటారు. తాజాగా సొంత భార్య భర్త వద్ద డబ్బు లాగేందుకు పెద్ద ప్లాన్ వేసింది. ఈ ఘటన గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోక ఉండరు. ప్రధానంగా  “ నీ భార్యను మేము Kiడ్నాప్ చేశామని.. ఆమెను వదిలేయాలంటే మేము అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేని యెడల చిత్ర హింసలకు గురిచేస్తాం” అని  ఓ Kiడ్నాపర్ నుంచి ఒక భర్తకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అతను భయాందోళనకు గురయ్యాడు. ఏం చేయాలో తోచక పోలీసులను ఆశ్రయించాడు. ఫోన్ కాల్స్ ని ట్రేస్ చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా పెద్ద ట్విస్ట్ వెలుగుచూసింది. సొంతం భార్యనే డబ్బుల కోసం ఈ కిడ్నాప్ నాటకం ఆడినట్టు వెల్లడి అయింది.  

Also Read :  గురక పెట్టే వారిలో ఈ తీవ్రమైన వ్యాధి వచ్చే అవకాశం.. జాగ్రత్త..!

Advertisement

ఈ విషయం తెలిసిన పోలీసులు ఆమెను వెంటనే అరెస్ట్ చేశారు. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. భారత సంతతికి చెందిన ఫిరోజా బీబీ జోసెఫ్ అనే 47 మహిళకు చాలా ఏళ్ల కిందట ఓ బిజినెస్ మ్యాన్ పెళ్లి అయింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆ మహిళ.. తన భర్తను ప్రతీసారి డబ్బులు అడగలేక, కిడ్నాప్ డ్రామాకు తెరలేపింది. భర్త వద్ద నుంచి భారీగా డబ్బులు కాజేయాలనుకుంి. ఓ వ్యక్తితో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడింది. మొదట ఫిరోజా తన భర్తకు కాల్ చేసి, తనను ఎవరో కిడ్నాప్ చేశారని తెలిపింది. వాళ్లు అడిగినత డబ్బులు విచ్చేసి తనను విడిపించమని కోరింది. ఆ తరువాత కిడ్నాపర్ కాల్ చేసి అడిగినంత ఇవ్వకపోతే నీ భార్యను టార్చర్ పెడతానంటూ బెదిరించాడు. ఆ మహిళ భర్త వెంటనే పోలీసులను సంప్రదించి తనకు వచ్చిన కిడ్నాప్ కాల్ గురించి ఫిర్యాదు చేశాడు.  

Advertisement

Also Read :  రష్మికకు ఉంగరం తొడిగిన విజయ్ దేవరకొండ.. ఇక జరిగేది పెళ్లేనా..?

Manam News

మరుసటి రోజు కిడ్నాపర్ డబ్బులు తొందరగా పంపించాలని మరో ఫోన్ కాల్ రాగానే.. పోలీసులు దానిని బ్రేక్ చేసి దర్యాప్తు చేశారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వెళ్లిందో అక్కడికి వెళ్లారు. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భర్త వద్ద నుంచి డబ్బులు కాజేందుకు భార్య ఫిరోజానే నాటకం ఆడినట్టు తేలింది. పీటర్ మారిట్ బర్గ్ నగరంలోని ఓ హోటల్ లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్లు దొంగిలించిన ఆభరణాలు కూడా ఆమె ఆధీనంలోనే ఉన్నాయి. సీసీటీవీ పుటేజ్ ల ఆధారంగా ఓ హోటల్ లో లగ్జరీగా నివసిస్తోందని తెలిసింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.  

Also Read :  పెళ్లికి ముందు తండ్రి కొడుక్కి నేర్పించాల్సిన 4 విష‌యాలు..2వ‌ది ఇంపార్టెంట్!

Visitors Are Also Reading