మన ఇంట్లో ఎవరైన చనిపోతే.. కాకులకు పిండం పెట్టాలని మంచి భోజనం సిద్ధం చేసి పెడుతాం. ఈ పద్దతి చాలా రోజుల నుంచి వస్తుంది. పూర్వ కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. కొంత మంది ఇంట్లో ఎదైన వ్రతాలు, నోములు వంటివి చేసుకున్నా.. కాకులకు అన్నం పెడుతారు. అయితే మనం కాకులకు ఎందుకు భోజంన పెడుతామో ఎప్పుడు అయినా ఆలోచించారా..? భూమి మీద అనేక రకాలు అయిన పక్షులు ఉంటాయి. కానీ మనం కాకులకు మాత్రమే భోజనం ఎందుకు పెడుతామో తెలుసా. ఈ ఆర్టికల్ లో కాకులకు ఎందుకు అన్నం పెడుతామో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
కాకులను మన ఇంట్లో చనిపోయిన పెద్దలు అని నమ్ముతారు. ఎవరైనా చనిపోయినప్పుడు కాకులకు అన్నం పెడుతారు. కాకులు వచ్చి తింటే.. చనిపోయిన వారు సంతోషంగా ఉన్నారని నమ్ముతారు. అలాగే గరుడ పురాణం తో పాటు మరి కొన్ని పురాణాల ప్రకారం చనిపోయిన పెద్దలు కాకుల రూపంలో భూమి పైన తిరుగుతారని ఉంటుంది. వాటికి అన్నం పెడితే కాకుల రూపంలో ఉన్న పెద్దలు మనల్నీ ఆశీర్వదిస్తారు.
Advertisement
అలాగే కాకి శని భగవానునికి కాకి వాహనం అని నమ్ముతారు. దీంతో మనం నోములు, వ్రతాలు చేసుకున్న సమయంలో నైవేద్యానికి తయారు చేసిన దానిలో కొంత కాకులుకు వేస్తే.. మనం చేసుకున్న వ్రతాలు, నోములు పూర్తి అయినట్టు కొంత మంది భావిస్తారు.
read more.. క్రిస్మస్ వేడుకల్లో ఉపాసన ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు