Home » Kiran Abbavaram : హీరోయిన్ తో ప్రేమలో పడ్డ కిరణ్ అబ్బవరం.. ఇదిగో ఇదే సాక్ష్యం!

Kiran Abbavaram : హీరోయిన్ తో ప్రేమలో పడ్డ కిరణ్ అబ్బవరం.. ఇదిగో ఇదే సాక్ష్యం!

by Bunty

కిరణ్ అబ్బవరం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా రాణిస్తున్న హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. రాజా వారు రాణి గారు తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతను ఎస్ ఆర్ కళ్యాణ మండపంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సెబాస్టియన్, పీసీ 524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువయ్యాడు. ఇక తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కిరణ్

READ ALSO : శ్రీ రెడ్డికి ఎప్పుడో పెళ్లయింది… భర్త ఎవరో తెలుసా?

వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈయన త్వరలో మీటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఈయన ప్రేమలో ఉన్నాడని వార్తలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అది కూడా ఒక హీరోయిన్ తో, తాజాగా కశ్మీర్ ట్రిప్ కు వెళ్లిన కిరణ్ అబ్బవరం అక్కడ దిగిన పలు ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేశాడు.

READ ALSO : Naresh- Pavitra : పెళ్లి చేసుకున్న నరేష్, పవిత్ర… వీడియో రిలీజ్

అక్కడే సేమ్ లొకేషన్స్ తో హీరోయిన్ రహస్య గోరక్ కూడా ఫోటోలను షేర్ చేయడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందని నెటిజన్లు అంటున్నారు. రాజావారు రాణి గారు సినిమాతో వీరిద్దరూ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. కిరణ్, రహస్యలకు ఆ సినిమా నుంచి మంచి బాండింగ్ ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరూ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఈ ఫ్రెండ్షిప్ ఇంకాస్త ముందుకు వెళ్లి ప్రేమగా మారిందా అనే విషయంపై వార్తలు వినిపిస్తున్నాయి కానీ క్లారిటీ లేదు.

READ ALSO : NBK 108 : బాలయ్య సినిమాలో శ్రీ లీల..ఏకంగా ఆ పాత్రలో

Visitors Are Also Reading