యావరేజ్ గా ఉండే అమ్మాయిలనే అబ్బాయిలు వదిలిపెట్టరు. ఇక సూపర్ గా ఉన్న అమ్మాయికి అస్సలు బాయ్ ఫ్రెండ్ లేకుండా ఉండదు. ఇది ఓ సినిమా డైలాగ్….ఇప్పుడెందుకు ఈ డైలాగ్ గురించి చెప్పామంటే ఇక్కడ జరిగిన ఓ సంఘటన కూడా అలాంటిదే మరి. సాధారణంగా హీరోయిన్ లు అంటే ఎంత అందంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి వెంట బడా హీరోల నుండి వ్యాపారవేత్తల వరకూ పెళ్లి చేసుకుంటామంటూ క్యూ కడతారు.
Advertisement
కానీ ఇక్కడ ఓ హీరోయిన్ మాత్రం అంతా షాక్ అయ్యే కామెంట్స్ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం….బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ పరినితి చోప్రా తాజాగా చేసిన కామెంట్ లు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా చాలా మంది బాలీవుడ్ బ్యూటీలు వివాహాలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పరిణితి చోప్రాకు కూడా పెళ్లి పై ప్రశ్న ఎదురయ్యింది. దాంతో పరిణితి మాట్లాడుతూ నేను ఇంకా సింగిల్ గానే ఉన్నానని చెప్పింది.
Advertisement
అంతే కాకుండా త్వరలోనే మింగిల్ అవ్వాలనే ఆసక్తి ఉందని చెప్పింది. బాలీవుడ్ లో జరుగుతున్న పెళ్లిళ్లు వారి ఫోటోలు చూస్తుంటే నాక్కూడా పెళ్లి చేసుకోవాలని ఉందని కామెంట్ చేసింది. కానీ పెళ్లికి వరుడు కావాలి కదా..ఇప్పటి వరకూ ప్రేమించాకే పెళ్లి చేసుకోవాలనుకున్నా కానీ ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటూ మనసులోని మాటను బయటపెట్టింది. అంతే కాకుండా ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా..? మంచి అబ్బాయి ఉంటే చెప్పండి అంటూ కామెంట్ చేసింది.