ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. నందమూరి అభిమానులు, టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల్లోకి రావడానికి సమయం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం మాత్రం సినిమాల మీదనే ఫోకస్ పెడతానని చెప్పేశారు.
Advertisement
ముఖ్యంగా టీడీపీలో రెండు వర్గాలున్నాయి. నందమూరి వర్సెస్ నారా.. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ని పార్టీలోకి రావాలని కోరుకునే వర్గం ఓ వైపు ఉంటే.. మరోవైపు నారా వారి చేతుల్లోనే పార్టీ ఉండాలని కోరుకునే వర్గం ఉంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఎక్కడ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లిపోతుందోనని బెంగ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం కొందరికీ ఇష్టం ఉంటే.. మరికొందరికీ మాత్రం ఇష్టం లేనట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
Also Read : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సమస్యలుండవు..!
Advertisement
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తారా ?
నూటికి కి నూరు శాతం.. రాష్ట్రం బాగు కోరుకునే అందరూ రాజకీయాల్లో కి రావాలి 💯
Nara Lokesh ✨
Jr NTR 💛#TirupatiSaysHelloLokesh #YuvaGalamPadayatra #YuvaGalamLokesh #HOPEVIJAYAWADACENTRAL pic.twitter.com/NPP3NU0Aab— Rajurabilli (@Rajurabilli2) February 24, 2023
తిరుపతి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ యువకులతో ముచ్చటించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని లోకేష్ ని అడగ్గా.. ఇందుకు లోకేష్ ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. “నూటికి నూరు శాతం ఆహ్వానిస్తామని..ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, ఈ రాష్ట్రం అగ్రస్థానానికి వెళ్లాలి, ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వారందరూ రాజకీయాల్లోకి రావాలి” అంటూ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై లోకేష్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Also Read : ఒకప్పటి నందమూరి హీరో ఇప్పుడు ఎలా మారిపోయాడో చూశారా..?