Home » సోర‌కాయ పండిచిన మెగాస్టార్..మీరు ఇలా చేయండి అంటూ స‌ల‌హా..!

సోర‌కాయ పండిచిన మెగాస్టార్..మీరు ఇలా చేయండి అంటూ స‌ల‌హా..!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే మెగాస్టార్ అప్పుడ‌ప్పుడూ కిచెన్ లో కూడా సంద‌డి చేస్తుంటారు. లాక్ డౌన్ వేళ లెగ్ పీస్ మ‌రియు ఫిష్ ఫ్రై చేసి సంద‌డి చేశారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అయ్యింది. అయితే ఇప్పుడు మెగాస్టార్ ఏకంగా త‌న ఇంట్లో ఉన్న పెర‌ట్లో ఓ సోర‌కాయ విత్త‌నాన్ని నాటారు. గ‌తంలో మెగాస్టార్ ఆ విత్త‌నాన్ని నాట‌గా ఇప్పుడు అది ఏకంగా పెరిగిపోయి కాయ‌లు కాసింది. ఆ సోర‌కాయ చెట్టు రెండు కాయ‌ల‌ను కాయగా చిరు ఒక కాయ‌ను త‌న చేతుల‌తో తెంపి మురిసిపోయారు.

chiranjeevi

chiranjeevi

ఈ సంధ‌ర్బంగా మెగాస్టార్ ఎంతో సంతోషం వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా దానికి సంబంధించిన వీడియోను చిరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో చిరు తాను స‌ర‌దాగా విత్తిన ఓ సోర‌కాయ విత్త‌నం ఇప్పుడు చెట్ట‌య్యిందని రెండు కాయ‌లు కాసింద‌ని తెలిపాడు. అందు ఓ కాయ‌ను కోసి చూపించారు. ప్ర‌కృతి ఎంతో గొప్ప‌ద‌ని తాను స‌ర‌దాగా నాటిన విత్త‌నం ఇప్పుడు క‌డుపు నింపుతోంద‌ని చెప్పారు. మీరు కూడా మీ ఇంట్లో కూర‌గాయల మొక్కలు నాటండి అంటూ మెగాస్టార్ పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement

also read : ప్రభాస్ “రాధేశ్యామ్” ట్రైలర్ విడుదల….!

ఒక చిన్న తొట్టి ఉన్నా దాంట్లో ట‌మాట చెట్ల‌ను పెంచ‌వ‌చ్చు అంటూ చిరంజీవి పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా మెగాస్టార్ రీఎంట్రీ త‌ర‌వాత వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే చిరు ఖైదీ నెం 150, సైరా న‌ర‌సింహారెడ్డి లాంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు.ఈ రెండు సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. ఇక ప్ర‌స్తుతం చిరు న‌టించిన ఆచార్య సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. మ‌రోవైపు చిరు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వేధాలం సినిమాను రీమేక్ చేస్తున్నారు.

Visitors Are Also Reading