Home » ప్రభాస్ “రాధేశ్యామ్” ట్రైలర్ విడుదల….!

ప్రభాస్ “రాధేశ్యామ్” ట్రైలర్ విడుదల….!

by AJAY
Ad

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటించింది. జిల్ ఫేమ్ రాధా కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ మరియు పోస్టర్లను విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. నేడు హైదరబాద్ లో భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి మరీ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ లో ప్రభాస్ మునుపు ఎన్నడూ లేని విధంగా కనిపించారు.

Advertisement

Advertisement

మొదటి సారి ప్రభాస్ ఓ కొత్త పాత్రను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా ఎమోషనల్ సీన్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ లవ్ సీన్ లతో నిండిపోయింది. ఇక ట్రైలర్ లో కృష్ణం రాజు లుక్ కూడా అదిరిపోయింది. అంతే కాకుండా ఎలాంటి ఫైట్ సీన్లు లేకుండా ట్రైలర్ కనిపిస్తోంది. దాంతో సినిమాలో లవ్ స్టోరీ నే ఎక్కువగా ఉండబోతున్నట్టు కనిపిస్తోంది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్న ఈ సినిమా ప్రభాస్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

 

Visitors Are Also Reading