తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది కేసీఆర్ సర్కార్. తెలంగాణలో టీఎస్పీఎస్సీ ద్వారా డిసెంబర్ కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో 2,391 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Advertisement
ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు శుక్రవారం టిఎస్పిఎస్సి మెడికల్ హెల్త్ బోర్డు మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థల ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిల్లో బీసీ గురుకులాల్లో భర్తీ 1,449 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితోపాటు ప్రిన్సిపాల్ పోస్టులు 10, డిగ్రీ లెక్చరర్స్ 185, జూనియర్ లెక్చరర్స్ పిజిటి 235, టిజిటి 324 పోస్టుల భర్తీకి అనుమతించింది.
Advertisement
బీసీ గురుకులాల్లో 153 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, సమాచార పౌర సంబంధాల శాఖలో 166 పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ గురుకుల విద్యాలయాల నియామక సంస్థల ద్వారా పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు హరీష్ రావు తెలియజేశారు.
In yet another good news to aspirants, Telangana government accorded permission to fill 2,391 posts in various departments through TSPSC, MHSRB & TREIRB.
TS govt under the leadership of #CMKCR garu serving & fulfilling promises made to the people.
Best wishes to the aspirants💐 pic.twitter.com/npj8JTEEUu— Harish Rao Thanneeru (@BRSHarish) January 27, 2023
READ ALSO : 10వ తరగతితో పోస్టాఫీస్ లో 40,889 ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులు అంటే, పూర్తి వివరాలు!