Home » 10వ తరగతితో పోస్టాఫీస్ లో 40,889 ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులు అంటే, పూర్తి వివరాలు!

10వ తరగతితో పోస్టాఫీస్ లో 40,889 ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులు అంటే, పూర్తి వివరాలు!

by Bunty

ఏపీ మరియు తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్రం.  భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లో ఖాళీగా ఉన్న, 40,889 గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్టు ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్లో 2,480 పోస్టులు ఉండగా తెలంగాణలో 1266 వరకు ఖాళీలు ఉన్నాయి.

రోజుకు కేవలం నాలుగు గంటల పని మాత్రమే ఉంటుంది. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ఆధారంగా ఇన్సెంటివ్ రూపంలో బిపిఎం/ ఏబిపిఎం/ డాక్ సేవక్ లకు ప్రోత్సాహం అందిస్తారు. ఈ విధమైన విధులు నిర్వర్తించడానికి లాప్టాప్/ కంప్యూటర్ / స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ అందిస్తుంది.

అర్హతలు

మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష సబ్జెక్టులతో పదవ తరగతి పాస్ అయితే చాలు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైతే తెలుగు సబ్జెక్టుతో 10 పాసై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయసు ఫిబ్రవరి 16, 2023 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 16, 2023వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 27 నుంచి ప్రారంభమవుతాయి.

 

దరఖాస్తు రుసుము

* అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.100/-

* SC/ST/PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు=0/-

తెలంగాణ, ఏపీలో ఉన్న పోస్టులు : 

ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు:2480

తెలంగాణ లో ఖాళీలు:1266

 

READ ALSO : Sakshi Shivanand : “మాస్టర్” సినిమా హీరోయిన్ సాక్షి శివానంద్ ఎంతలా మారిపోయిందో చూడండి!

Visitors Are Also Reading