Pathaan Movie Review in Telugu: : షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘పఠాన్’. నాలుగేళ్ల విరామం తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రం ఇది. ‘జీరో తర్వాత అతిథి పాత్రలు లేదంటే ప్రత్యేక పాత్రల్లో తెరపై కనిపించారు. ఈ సినిమాలో ‘బేషరమ్ రంగ్’ పాటలో హీరోయిన్ దీపికా పదుకొనే ధరించిన బికినీ రంగు వివాదాస్పదమైంది. మరి ఇవాళ రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Sharuk Khan Pathaan Movie Review and Rating in Telugu
READ ALSO : శుభ్ మన్ గిల్ కు కొత్త పేరు పెట్టిన సునీల్ గావస్కర్.. ప్రియురాలు కూడా ఇలానే పిలవాలేమో?
Advertisement
కథ మరియు వివరణ:
భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాకిస్తాన్ కల్నల్ ఒకరు ఆగ్రహంతో రగిలిపోతాడు. దుష్మన్ తో దోస్తీ చేసే సమయం వచ్చిందని ప్రైవేట్ ఏజెన్సీ అవుట్ ఫిట్ ఎక్స్ లీడర్ జిమ్ (జాన్ అబ్రహం) కు ఫోన్ చేస్తాడు. కాశ్మీర్ కావాలని లేదంటే ఇండియాపై అటాక్ చేయాలని కోరతాడు. మన దేశంపై బయోవార్ ప్లాన్ చేస్తాడు జిమ్. అతడిని ఇండియన్ ఏజెంట్ పఠాన్ (షారుఖ్ ఖాన్) ఎలా అడ్డుకున్నాడు? అనేది అసలు కథ. ఇండియన్ ఏజెంట్లకు దూరంగా కొన్నాళ్లు అజ్ఞాతవాసంలో పఠాన్ ఎందుకు ఉన్నాడు? పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ రూబై (దీపికా పదుకొనే) పటాన్ మధ్య ఏం జరిగింది? ‘పఠాన్’కు ఆమె సాయం చేసిందా? మోసం చేసిందా? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
Advertisement
చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. ఆయన నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఒంటి చేత్తో సినిమాని పైకి లేపాడు. ప్రతి సన్నివేశంలోనూ షారుక్ అదరగొట్టాడు. ఇక ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. ఆమె తన నటనతో పాటు గ్లామర్ తోను ప్రేక్షకులని కట్టిపడేసింది. ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులు థ్రిల్ అవుతున్నారు. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేయగా, అతను కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. సీనియర్ నటి డింపుల్ కపాడియా మరియు అశుతోష్ రానా కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. మిగతా పాత్రధారులు కూడా అద్భుతంగానే నటించారు.
ప్లస్ పాయింట్స్:
షారూక్ నటన
సంగీతం
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
సాగదీత సన్నివేశాలు
దర్శకత్వం లోపం
రేటింగ్:3/5
READ ALSO : నా కారుపై ఎలాంటి దాడి జరగలేదు.. క్లారిటీ ఇచ్చిన సింగర్ మంగ్లీ!