Home » నా కారుపై ఎలాంటి దాడి జరగలేదు.. క్లారిటీ ఇచ్చిన సింగర్ మంగ్లీ!

నా కారుపై ఎలాంటి దాడి జరగలేదు.. క్లారిటీ ఇచ్చిన సింగర్ మంగ్లీ!

by Bunty
Ad

టాలీవుడ్ సింగర్ మంగ్లీ కి తాజాగా ఊహించని పరిణామం ఎదురైందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగిందని, కర్ణాటకలోని బళ్లారిలో ఈ ఘటన జరిగిందని వార్తలు వచ్చాయి. బళ్ళారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతుండగా ఆమె కారుపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేశారట. ఈ సంఘటన జరిగిందని ఏకంగా వీడియోలు కూడా సర్క్యులేట్ అయ్యాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కారుపై దాడి చేసేంతగా ఏం జరిగిందని తెగ మాట్లాడుకున్నారు. సదరు వీడియోలు చూసి తెగ భయపడ్డారు. మంగ్లీపై వాళ్లకు ఎందుకు కోపం వచ్చిందని కూడా తెగ మాట్లాడుకున్నారు.

Advertisement

Advertisement

ఇప్పుడు ఆ విషయాలపై పూర్తి క్లారిటీ ఇచ్చిన సింగర్ మంగ్లీ, ఏకంగా ఓ ప్రేస్ నోట్ ని రిలీజ్ చేసింది.నిన్న బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులో ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలను నేను పూర్తిగా ఖండిస్తున్నానని తెలిపారు. ఫోటోలు మరియు వీడియోలు నుండి మీరందరూ చూడగలిగే విధంగా ఈవెంట్ భారీ విజయాన్ని సాధించింది.

ఉత్తమ ఈవెంట్లలో ఒకటి, అన్నారు కన్నడ ప్రజలు నాపై కురిపించిన ప్రేమ మరియు మద్దతు అపారమైనది. ఈవెంట్ లో నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇది మాటలలో వర్ణించలేనిది. ఇదంతా నా ప్రతిష్టను కించపరచడానికి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరియు ఈ విధమైన తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని పేర్కొన్నారు మంగ్లీ.

READ ALSO : తిరుమలలో డ్రోన్ కలకలం… ఎగుర వేసిన వ్యక్తిపై ఆ కేసు నమోదు!

Visitors Are Also Reading