Home » శుభ్ మన్ గిల్ కు కొత్త పేరు పెట్టిన సునీల్ గావస్కర్.. ప్రియురాలు కూడా ఇలానే పిలవాలేమో?

శుభ్ మన్ గిల్ కు కొత్త పేరు పెట్టిన సునీల్ గావస్కర్.. ప్రియురాలు కూడా ఇలానే పిలవాలేమో?

by Bunty
Ad

హైదరాబాదులోని ఉప్పల్ వేదికగా జరిగిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ అభిమానులకు అసలు మజాను పంచింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తోలుత అఖరి సిక్సర్లతో విరుచుకుపడి డబుల్ సెంచరీ సాధించగా, అనంతరం కివిస్ ఆల్ రౌండర్ మైకేల్ బ్రెస్ వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ తో మ్యాచ్ పై ఆసక్తి రేకెత్తించాడు.

Advertisement

అయితే, తొలి వన్డేలో డబుల్ సెంచరీ తో మెరిసిన శుబ్ మన్ గిల్, రెండో వన్డే లోను 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ను ఆడి జట్టును గెలిపించాడు. దీంతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0 తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక తన ఇన్నింగ్స్ లతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడిన గిల్ పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

Advertisement

రెండో వన్డే సందర్భంగా సునీల్ గావస్కర్ మ్యాచ్ కామెంటరిలో పాల్గొన్నాడు. లైవ్ జరుగుతున్న సమయంలోనే గిల్ కు గావస్కర్ కొత్త పేరును ప్రతిపాదిస్తున్నట్లు అడిగాడు. గిల్ నీకు ఒక నిక్ నేమ్ పెడుతున్న, అదేంటో తెలుసా, ‘స్మూత్ మాన్ గిల్’, నీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా అంటూ కామెంట్ చేశారు. కాగా గావస్కర్ కామెంట్ పై గిల్ వెంటనే స్పందించాడు. “అలా ఏం లేదు సార్, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు.

READ ALSO : నా కారుపై ఎలాంటి దాడి జరగలేదు.. క్లారిటీ ఇచ్చిన సింగర్ మంగ్లీ!

Visitors Are Also Reading