Home » సమంత 10వ తరగతి మార్కులను మీరు చూశారా..? సోషల్ మీడియాలో వైరల్..!

సమంత 10వ తరగతి మార్కులను మీరు చూశారా..? సోషల్ మీడియాలో వైరల్..!

by Anji
Published: Last Updated on

ప్రస్తుత సమాజంలో ఏ ఫంక్షన్ కి వెళ్లినా.. బంధువులను కలిసిన తొలుత ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే ఏం చదువుతున్నావు.. ఏం చేస్తున్నావు అని అడుగుతుంటారు. దీనిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. మన పెద్దవాళ్లు చదువుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారో అనే అలాంటి చదువులో మనకు నచ్చిన హీరోనో.. హీరోయిన్ నో ముందుంటే మనమే ఉన్నట్టు ఫీల్ అవుతాం. అయితే ఓ స్టార్ హీరోయిన్ కి సంబంధించిన మార్కుల లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు..? ఆమెకు వచ్చిన మార్కులెన్ని..? ఇలాంటి వివరాల గురించి మనం తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి: “మర్యాద రామన్న” సినిమాలోని హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఏం చేస్తోందంటే?

టాలీవుడ్ లో చాలా మంది నటీనటులు పెద్ద పెద్ద చదువులే చదివారు. మెగాస్టార్ చిరంజీవి, డిగ్రీ ఇన్ కామర్స్ చదవగా.. జూనియర్ ఎన్టీఆర్, ఇంటర్ తోనే ఆపేశారు. అదేవిధంగా ఇంకా చాలా మంది డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, బీకాం చదివారు. విదేశాలలో సైతం చదివిన హీరోలు, హీరోయిన్స్ టాలీవుడ్ లో ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో సమంతకు చెందిన పదో తరగతి మార్కుల లిస్ట్ వైరల్ గా మారింది. ఆ మార్కుల లిస్ట్ ని చూసిన వారు సమంత ఇంత బాగా చదువుతుందా అనే ముక్కున వేలేసుకుంటున్నారు.  

Also Read :  SSC MTS Recruitment 2023 : 10వ తరగతితో 12,523 ఉద్యోగాలు, నోటిఫికేషన్ వివరాలు ఇవే

Also Read :  లెజెండ్ నుంచి వీరసింహారెడ్డి వరకు బాలయ్య నటించిన 10 సినిమాల కలెక్షన్లు ఇవే..!

అందం, అభినయం ఇదే మనకు సమంత గురించి తెలిసిన విషయం. మనకు తెలియని తారల గతాలు కూడా ఉంటాయి. బయటపడినప్పుడే వారిలో ఇంత టాలెంట్ ఉందా అని మనకు తెలుస్తోంది. సమంత చదువులో టాపర్. దీనికి సంబంధించిన మార్కుల లిస్ట్ బయటపడింది. సమంత చెన్నైలోని సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యూలేషన్ స్కూల్ లో పదోతరగతి వరకు చదివింది. అప్పుడు హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ లో 1000 మార్కులకు గాను సమంతకు 887 మార్కులు వచ్చాయి. మ్యాథ్స్ లో ఏకంగా 100కి 100 మార్కులొచ్చాయి. స్కూల్ టీచర్లు సైతం ఆమెను ప్రశంసిస్తూ.. ప్రోగ్రెస్ కార్డులో ప్రత్యేకంగా రాసారు. ఈ లిస్ట్ ని చూసిన అభిమానులు తమ హీరోయిన్ టాపర్ అంటూ మురిసిపోతున్నారు. సమంత మార్కుల లిస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.  

 

Visitors Are Also Reading